మహేష్‌ అంత తెలివి తక్కువోడు కాదు!     2018-06-13   05:03:00  IST  Raghu V

తాజాగా తమిళంలో మురుగదాస్‌ నిర్మించిన ఒక సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఆ సందర్బంగా త్వరలోనే స్పైడర్‌ను హిందీలో రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తెలుగులో మహేష్‌బాబు స్పైడర్‌తో ఆకట్టుకోలేక పోయాడు. అయినా కూడా మురుగదాస్‌ తన స్పైడర్‌ రీమేక్‌ను మహేష్‌బాబుతోనే చేయాలని ఆశ పడుతున్నాడు. హిందీలో ఇప్పటి వరకు మహేష్‌బాబుకు పెద్దగా గుర్తింపు లేదు. ఈయన చేసిన సినిమాలు హిందీలో డబ్‌ అయినా కూడా ఇప్పటి వరకు పెద్దగా ఆడలేదు.

అల్లు అర్జున్‌ స్థాయిలో కూడా మహేష్‌బాబుకు గుర్తింపు లేదని చెప్పక తప్పదు. ఇలాంటి సమయంలో మహేష్‌బాబు హిందీలో స్పైడర్‌ చిత్రంతో ఎంట్రీ ఇవ్వడం అనేది పెద్ద తప్పిదం అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. మహేష్‌బాబు అయినా అలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటాడని తాము భావించడం లేదు అంటూ మహేష్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. తెలుగులోనే మహేష్‌బాబు కొనసాగాలి అని, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఇతర సినిమాలు చేయవద్దని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. మహేష్‌బాబు కాదు అంటే హిందీ హీరోతో స్పైడర్‌ చిత్రం రీమేక్‌కు మురుగదాస్‌ ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.