ఆ దరిద్రం మళ్ళీ వద్దు అంటున్న మహేష్

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ గురించి కొత్తగా చెప్పేదేముంది. తుమ్ముతున్న సమయంలో షాట్ బాగా వస్తే, మళ్ళీ తుమ్మండి అని అడిగే టైప్ ఈ సినిమాతారలు. అంతలా సెంటిమెంట్స్ సీరియస్ తీసుకుంటారు. ఇక మహేష్ బాబు తాజా సెంటిమెంట్ మే నెల. దాన్ని దరిద్రంగా అభివర్ణిస్తుంటారు ప్రిన్స్ అభిమానులు. ఇంతకీ మే నెల చేసిన పాపం ఏమిటి ? మహేష్ బాబుకి రెండు అపజయాలను ఇచ్చింది ఈ నెల.

అపుడెప్పుడో వచ్చిన నిజం మేలోనే వచ్చింది. దాంతో మొదట బ్రహ్మోత్సవం మేలో విడుదల చేయడాన్ని వద్దు అని అనుకున్నా, అప్పటికే ఆలస్యం జరగటంతో మేలోనే విడుదల చేసారు. ఇక ఆ సినిమా ఫలితం గురించి కొత్తగా చెప్పేదేముంది. మహేష్ బాబుకి తన కెరీర్లో ఓ సినిమాని డిలీట్ చేసే అవకాశం దొరికితే, ఖచ్చింతంగా ఈ సినిమానే ఎంచుకుంటాడెమో. ఇలా రెండుసార్లు మేలో బొక్కబోర్లపడ్డాడు సూపర్ స్టార్.

అందుకే, మళ్ళీ మే నెల వద్దు అంటున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో తానూ నటిస్తున్న సినిమా మార్చిలోనే పూర్తయిపోతుందట. ఒకవేళ బాహుబలి ఏప్రిల్ 28న రాలేకపోతే, అదే తెదినా మహేష్ వచ్చేస్తాడు. అలా కాకుండా బాహుబలి అనుకున్న సమయానికే విడుదల అయితే, ఏకంగా జూన్ 23వ తేదిన తన సినిమా రిలీజ్ చేసుకునే ప్లాన్ లో ఉన్నాడట మహేష్. రెండు నెలలు ఆలస్యంగా వచ్చిన ఫర్వాలేదు కాని, మే మాత్రం తనకి వద్దు అంటున్నాడు.