మహేష్‌, కొరటాల ఇద్దరు గొప్పోల్లే!!     2018-05-01   07:20:08  IST  Raghu V

మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకు పోతుంది. కేవలం మొదటి వారం రోజుల్లోనే ఏకంగా 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం టాలీవుడ్‌ నెం. 3 దిశగా దూసుకు పోతుంది. భారీ ఎత్తున విడుదల అయిన ఈ చిత్రం మరోసారి మహేష్‌ సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌ను కాపాడటం జరిగింది. బ్రహ్మోత్సవం మరియు స్పైడర్‌ చిత్రాలతో భారీ డిజాస్టర్‌లు చవి చూసిన మహేష్‌బాబు ఈ చిత్రం విజయంతో మళ్లీ తేరుకున్నాడు.

గతంలో కూడా ‘శ్రీమంతుడు’ చిత్రంతో మహేష్‌బాబుకు దర్శకుడు కొరటాల శివ భారీ విజయాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో కూడా మహేష్‌బాబుకు చాలా హెల్ప్‌గా నిలిచాడు. తాజాగా ఈ చిత్రంతో మరోసారి మహేష్‌బాబు స్టార్‌డంను కాపాడాడు. ఆ విషయాన్ని స్వయంగా మహేష్‌బాబు చెప్పుకొచ్చాడు. తాను కష్టంలో ఉన్న సమయంలో దర్శకుడు కొరటాల శివ రెండు సార్లు లైఫ్‌ ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఒక స్టార్‌ హీరో అయ్యి ఉండి కేవలం నాలుగు సినిమాలు చేసిన దర్శకుడి గురించి అలా మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. తాజాగా మహేష్‌బాబు చేసిన వ్యాఖ్యలపై కొరటాల శివ స్పందించాడు.