సొంత డబ్బంతా పోగొట్టుకుంటున్న మహేష్ బాబు     2017-10-14   01:19:46  IST  Raghu V

Mahesh Babu loosing personal money with every film

సూపర్ స్టార్ కృష్ణగారి అబ్బాయి అన్నట్లే కాని, మహేష్ బాబు హీరోగా ఎంటర్ అవుతున్నప్పుడు వారి ఇంటి పరిస్థితులు మరి అంత గొప్పగా ఏమి లేవు. కారణాలు కరెక్టుగా తెలియవు కాని కృష్ణ అప్పుడు అప్పుల్లో ఉన్నారు. పద్మాలయ స్టూడియోస్ లో కొంత భాగాన్ని అమ్మేసుకున్నారు కూడా. మహేష్ తన తొలిరోజుల్లో పెద్దగా పారితోషికం తీసుకోలేదు. ఎంతైనా కొద్దిగా సాఫ్ట్ మనిషి కదా. నిర్మాతల కష్టాలు చూసి వెంటనే కరిగిపోతాడు. ఒక్కడుతో మెల్లిగా ఆర్థిక పరిస్థితులను బెటర్ చేయడం మొదలుపెట్టాడు మహేష్‌. పారితోషికం కోట్లకు చేరుకుంది ఈ సినిమాతోనే.

మరి ఇప్పుడు మహేష్ దక్షిణాదిలో రజనీకాంత్ తరువాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడు. బ్రాండ్ల ద్వారా వచ్చే డబ్బులు లెక్కవేసుకుంటే, దక్షిణాది మొత్తంలో అత్యధిక అదాయం అందుకుంటున్న నటుడు. సినిమా కాకుండా, ఇతర వ్యాపారాలను లెక్కలోకి తీసుకుంటే మాత్రం ర్యాంకు మారుతుంది. ఎలాగైతే ఏం, మహేష్ బాబు బాగా సంపాదిస్తున్నాడు. మరి ప్రాబ్లెం ఏమిటి?