Mahesh Babu looks like a heroine – insults Bolly critic

బాలివుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) మామూలుగానే బాలివుడ్ హీరోహీరోయిన్లని ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తూ కావాల్సిన పబ్లిసిటి పొందుతూ ఉంటాడు. ఇక దక్షిణాది సినిమావారినైతే నోటికి ఇష్టం వచ్చినట్లు అవమానిస్తాడు. పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అని, బాలివుడ్ లో ఇలాంటి వారికి సైడ్ యాక్టర్ రోల్స్ దొరకడం కూడా కష్టమని, పవన్ టాలివుడ్ లో పెద్ద స్టార్ అనే వినడానికి విడ్డూరంగా ఉందని అప్పట్లో కామెంట్స్ చేసాడు కేఆర్కే. ఆ తరువాత సమంత అసలు దక్షిణాదిలో పెద్ద హీరోయిన్ ఎలా అయ్యిందో అర్థం కాదు అన్నాడు. ఇక ధనుష్ కి ప్రపంచంలోనే అతి చెత్తగా కనిపించే నటుడు అంటూ వర్ణవివక్ష కామెంట్స్ కూడా చేసాడు కేఆర్కే. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ మీద కూడా ఆడిపోసుకున్నాడు. ఇంత చెత్తగా కనిపించేవాడు హీరో ఎలా అయ్యాడు అంటూ విమర్శించాడు.

ఇలాంటి పదాలు మహేష్ బాబు మీద ఉపయోగించలేము కాబట్టి సూపర్ స్టార్ మీద ఇంకోరకంగా దాడి చేసాడు కేఆర్కే. “మహేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు అనుష్క శర్మ లాగా అందంగా, క్యూట్ గా ఉంటావు. బాలివుడ్ లో కూడా ఫేమస్ అవ్వాలి అనుకుంటే నా తదుపరి సినిమాలో చిన్న వేషం వెయ్యి” అంటూ మహేష్ మీద ట్వీట్ వేసాడు కేఆర్కే. సాధారణంగా అందరు మహేష్ బాబు హీరోయిన్స్ కంటే గ్లామరస్ గా ఉంటాడు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తారు. కాని కేఆర్కే దాన్నే కొద్దిగా మార్చి విమర్శకి ఉపయోగించాడు.

ఇక్కడ విశేషం ఏమిటంటే, ఈ ట్వీట్స్ పడగానే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కేఆర్కేకి వ్యతిరకేంగా బదులిచ్చారు. మాలో మేము ఎంతైనా గొడవపడతాం కాని బయటి వ్యక్తులు కామెంట్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చాటిచెప్పారు.