అక్కడ రజినీకాంత్ కూడా మహేష్ బాబు తరువాతే  

అదేదో సినిమాలో అన్నట్లు, అమెరికా బాక్సాఫీస్ దగ్గర మహేష్ బాబు స్థాయి స్థానం వేరు. హెడింగ్ చూసి మీరు తిట్టుకుంటారేమో కాని, అసలు కబాలి మినహాయిస్తే, మహేష్ బాబు ఓపెనింగ్స్ ని ఎప్పుడు ఛాలెంజ్ చేయలేదు సూపర్ స్టార్ రజినీకాంత్. కబాలి యూఎస్ మార్కెట్ లో అదరగొట్టిన రెండోవ తమిళ సినిమా. మొదటిది ఎప్పుడో వచ్చిన రోబో. ఇప్పుడు ఆ కబాలి రికార్డులని కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు మహేష్ బాబు.

స్పైడర్ అమెరికా స్క్రీన్ కౌంట్ రోజురోజుకి పెరిగిపోతోంది. 600 స్క్రీన్స్ లో సినిమా విడుదల కాబోతోందని, ఆ లెక్క 700 కూడా దాటోచ్చని తెలుగుస్టాప్ ఇప్పటికే పలుమార్లు రిపోర్ట్ చేసింది. ఆ లెక్క కాస్త 850 అయ్యింది ఇప్పుడు. అవును, స్పైడర్ అమెరికా స్క్రీన్ కౌంట్ ఏకంగా 850. మన తెలుగు రాష్ట్రాల్లో, ఏ ఒక్క ట్రేడ్ ఏరియాలో కూడా ఇన్నేసి థియేటర్లలో విడుదల కాదు ఓ పెద్ద సినిమా. బాహుబలి 2 అమెరికాలో 1100 కి పైగా స్క్రీన్స్ లో విడుదల అయ్యింది. కబాలి 450 కి పైగా స్క్రీన్స్ లో విడుదల అయ్యింది. ఇప్పుడు స్పైడర్ కబాలిని చాలా పెద్ద మార్జిన్ తో బద్దలుకొట్టి, 850 స్క్రీన్స్ లో విడుదల అవుతోంది. ఇది కేవలం భారతీయ సినిమా చరిత్రలోనే కాదు, పూర్తిగా ఆసియా ఖండం సినిమాలు తీసుకున్నా, అతిపెద్ద రిలీజ్ కౌంట్స్ లో ఒకటి.

850 స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు కాని, ఇందులో 200కి పైగా స్క్రీన్స్ తమిళ వెర్షన్ వే ఉంటాయి. మరి తమిళ స్క్రీన్స్ లో మురుగదాస్ ఏమేరకు పనిచేస్తుందో చూడాలి. అమెరికాలో కేవలం రజినీకాంత్ మినిహా, ఏ అగ్రహీరోకి కూడా పెద్ద మార్కెట్ లేదు. మరి అన్నేసి తమిళ స్క్రీన్స్ ఏం చేసుకుంటారో. ఇక ప్రీమియర్స్ ఎన్ని స్క్రీన్స్ లో వేస్తున్నారో చూడాలి. ప్రీమియర్స్ ద్వారా మిలియన్ మార్కు దాదాపుగా ఖరారు అయినా, ఆ పైనా ఎంత వస్తుందో చూడాలి. అలాగే, కబాలికి తెలుగు ప్రేక్షకులు అమెరికాలో బ్రహ్మరథం పట్టారు. తమిళ వెర్షన్ కంటే, తెలుగు వెర్షనే ఎక్కువ కలెక్ట్ చేసింది. మరి అదే మాదిరి ఆదరణ తమిళ ప్రేక్షకులు తెలుగు సూపర్ స్టార్ కి ఇస్తారా?