Mahesh Babu deeply hurts Puri Jagannath

“ఎవరు నన్ను నమ్మని సమయంలో మహేష్ ఒక్కడే నన్ను నమ్మాడు” అని బిజిజెస్ మెన్ తరువాత ఓ స్టెట్‌మెంట్ ఇచ్చారు పూరి జగన్నాథ్. ఒక సమయంలో మహేష్ – పూరి జగన్నాథ్ మధ్య ఉన్న సంబంధాలు అలాంటివి. ఇప్పుడు చెడిపోయాయి అని కాదు కాని, మహేష్ వలన పూరి జగన్నాథ్ బాధపడుతున్నారనేది మాత్రం కాదనలేని వాస్తవం.

ఎప్పుడో ఏప్రిల్ లో “జనగణమన” ని ప్రకటించారు పూరి జగన్నాథ్. అయితే అప్పటికే మహేష్ మురుగదాస్ తో సినిమాకి కమిట్ అయినా, కొరటాల శివతో మరో సినిమా మాత్రం అనుకోలేదు. బహుషా మురుగదాస్ సినిమా తరువాత “జనగణమన” మొదలవుతుంది అని అందరూ అనుకుంటుండగా, మళ్ళీ కొరటాలకే ఓ సినిమా ఇచ్చేసాడు మహేష్. దాంతో పూరి కొంత డిజపాయింట్ అయ్యారని అప్పట్లో టాక్ నడిచింది.

కథ నచ్చి కూడా మహేష్ మళ్ళీ స్పందించట్లేదు అని, ఎప్పుడూ తీసినా, ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా తీస్తానని చెప్పారు పూరి. మరి మహేష్ ఎందుకు స్పందించట్లేదు. ఈమధ్యకాలంలో మూడు డిజాస్టర్లు రావడంతో భయపడుతున్నాడా అంటే పూరి ఇంతవరకు తనకు ఫ్లాప్ ఇచ్చింది లేదు. బహుషా పూరి ప్రస్తుతం ఉన్న ఫామ్ వలనే మహేష్ అలోచిస్తున్నాడేమో! ఒకవేళ మహేష్ పూరితో సినిమా చేద్దాం అని నిర్ణయించుకున్నా, అది ఇప్పట్లో మొదలవ్వదు. కొరటాలతో సినిమా వచ్చే ఏడాది ఆగష్టు, సెప్టెంబరు దాకా పూర్తవ్వదు. ఆ తరువాతే, పూరికి ఏమైనా ఛాన్స్ ఉంటే.