Mahesh Babu as Lord Krishna in 1000cr Mahabharata?

మహాభారతంలో అతికీలకమైన శ్రీకృష్ణభగవానుడి పాత్ర కోసం మహేష్ బాబు, హృతిక్ రోషన్ లో ఒకరిని అనుకుంటున్నామని, అయితే ఇంకా వారితో సంప్రదింపులు జరపలేదని దర్శకుడు నిన్న జరిగిన ఓ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఈ ఇద్దరు అందగాళ్ళు శ్రీకృష్ణుని పాత్రకి బాగా సరిపోతారు కాని ఇద్దరిలో ఈ పాత్ర చేయడానికి ఎవరు ముందుకొస్తారు అనేది ప్రశ్న.

తమిళంలో బాహుబలి రేంజ్ లో మొదలుపెట్టిన సంఘమిత్ర సినిమాకోసం మహేష్ కి 50 కోట్ల పారితోషికం అఫర్ చేసిన మహేష్ ఒప్పుకోలేదు. రాజమౌళి అడిగితే తప్ప, పౌరాణికాలు, జానపద కథలు చేసే ఆసక్తి లేదని ప్రిన్స్ ఇప్పటికే ప్రకటించాడు. సో, మలయాళ మహాభారతానికి ఇక హృతిక్ రోషనే దిక్కు అన్నమాట.