మహేష్‌ మరీ చిల్లరగా ప్రవర్తిస్తున్నాడు  

సినిమా సక్సెస్‌ అయినా ఫ్లాప్‌ అయినా కూడా పాతిక కోట్లకు తగ్గకుండా పారితోషికంను తీసుకోవడంతో పాటు, లాభాల్లో వాటాలు మరియు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కోట్లల్లో ఆదాయం ఉన్న మహేష్‌బాబు తన దత్తత గ్రామాల కోసం ఇప్పటి వరకు కనీసం కోటి రూపాయలు ఖర్చు చేయక పోవడంను కొందరు తప్పుబడుతున్నారు. అలాంటప్పుడు మహేష్‌ పేరు కోసం ఆ గ్రామాలను దత్తత తీసుకున్నట్లుగా అనుకోవాల్సి వస్తుందని కొందరు అంటున్నారు. మహేష్‌బాబుపై చేస్తున్న ఆరోపణలకు ఆయన సన్నిహితుల నుండి కాని, ఆయన నుండి కాని ఎలాంటి స్పందన లేదు.

మహేష్‌బాబు తరపున నమ్రత దత్తత గ్రామాల్లో పలు సార్లు సందర్శించారు. ఎన్ని సార్లు సందర్శించినా కూడా ఆ గ్రామాల్లో ఉన్న ప్రాధమిక సమస్యల పరిష్కారం ఇప్పటి వరకు జరగలేదని చెప్పక తప్పదు. గ్రామాల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుండి సాయం కోరడం లేదా, దాతల నుండి సాయం వస్తే అప్పుడు ఇవ్వాలని చూడటం మహేష్‌బాబు అండ్‌ కోకు ఏమాత్రం పద్దతి కాదు అంటూ ఆ గ్రామాల ప్రజలు అంటున్నారు. తాజాగా ఒక మీడియా సంస్థ తెలంగాణలో మహేష్‌బాబు దత్తత తీసుకున్న గ్రామంకు వెళ్లారు. అక్కడ ప్రజలు మహేష్‌ దత్తత తీసుకున్నంత మాత్రాన తమ గ్రామం పెద్దగా అభివృద్ది చెందినది ఏమీ లేదని, అసలు తాము కొన్ని సార్లు ఆ విషయాన్ని మర్చి పోతున్నామని వారు అంటున్నారు. ఇప్పటికైనా మహేష్‌బాబు కాస్త తన చేతి నుండి డబ్బులు జార్చి ఆయా గ్రామాలను అభివృద్ది చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.