మహేష్‌ 25.. వదలని వివాదం     2018-06-19   00:29:47  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు ఇటీవలే ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం రికార్డు స్థాయి వసూళ్లను సాధించి టాలీవుడ్‌ టాప్‌ చిత్రాల జాబితాలో చేరింది. మహేష్‌బాబు ఆ సినిమాలో సీఎంగా కనిపించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం మహేష్‌బాబు తన 25వ చిత్రం కోసం సిద్దం అయ్యాడు. ఇటీవలే మహేష్‌ 25 చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. డెహ్రాడూన్‌లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌బాబుతో ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌లు నిర్మిస్తున్నారు.

మహేష్‌బాబు 25వ చిత్రాన్ని మొదట ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మించాల్సి ఉంది. కాని ఆయన్ను ఈ చిత్రం నుండి తప్పించిన దర్శకుడు వంశీ మరియు మహేష్‌బాబులు దిల్‌రాజు మరియు అశ్వినీదత్‌ల వద్దకు వచ్చారు. పీవీపీ నుండి ఎందుకు దూరంగా జరిగారు అనే విషయంలో క్లారిటీ రాలేదు. తాను నిర్మించాల్సిన ప్రాజెక్ట్‌ను దిల్‌రాజు, అశ్వినీదత్‌ల వద్దకు వంశీ తీసుకు వెళ్లాడు అంటూ పీవీపీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చిన్న వివాదం కారణంగా తాను రెడీ చేయించిన కథతో మహేష్‌ ఎలా వారి బ్యానర్‌లో నటిస్తాడు అంటూ పీవీపీ నిర్మాతల మండలి వద్దకు వెళ్లాడు.