Mahesh at 7th in India’s Most Desirable Men .. Prabhas finds place

టైమ్స్ మ్యాగజీన్ కాస్త ఆలస్యం చేసినా, 2016 సంవత్సరానికి గాను “మోస్ట్ డిజైరబుల్ మెన్” లిస్టుని ప్రకటించింది. ప్రతి ఏడాది ఈ పోటి జరుగుతుంది. ఓట్ల ప్రకారం 50 మంది లిస్టులోకి ఎంటర్ అవుతారు. ఎప్పటిలాగే దక్షిణాది నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ 10 లో నిలిచాడు. అయితే గత రెండు సంవత్సరాలిగా 6వ స్థానంలో ఉన్న ప్రిన్స్, ఈసారి ఓ స్థానం కిందకి పడిపోయి 7వ స్థానంలో నిలిచాడు. 2012లో మహేష్ స్థానం నెం.2 అయితే, 2013లో మహేష్ నెం.1 స్థానాన్ని సంపాదించడం విశేషం.

ఇక మిగితా తెలుగు నటుల విషయానికి వస్తే, ప్రభాస్ 22వ స్థానం, రానా దగ్గుబాటి 24వ స్థానంలో నిలిచారు. మన హైదరాబాద్ కే చెందిన మిస్టర్ ఇండియా 2015 రోహిత్ ఖండేల్వాల్ సినిమాతారలు, క్రికేట్ స్టార్స్ ని తలదన్ని సంచలనాత్మక రీతిలో నెం.1 స్థానాన్ని సాధించాడు. భారత క్రికేట్ జట్టు సారథ విరాట్ కొహ్లీ నెం.2 ర్యాంకులో నిలిచాడు. ఇక 2016 టాప్ 10 భారతీయ అందగాళ్ళ లిస్టు ఇలా ఉంది.

1) రోహిత్ ఖండేల్వాల్

2) విరాట్ కొహ్లీ

3) హృతిక్ రోషన్

4) రణవీర్ సింగ్

5) ఫవాద్ ఖాన్

6) సిద్ధార్థ్ మల్హోత్రా

7) మహేష్ బాబు

8) జితేష్ ఠాకూర్

9) దిల్జీత్ దోసంజ్

10) షాహిద్ కపూర్