మహేష్‌ 25వ చిత్రం కాపీనట!     2018-04-28   00:27:58  IST  Raghu V

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తాజాగా ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం రికార్డులు బ్రేక్‌ చేస్తూ వసూళ్లు సాధిస్తుంది. ఈ సమయంలోనే మహేష్‌బాబు నటించబోతున్న 25వ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వినీదత్‌లు సంయుక్తంగా మహేష్‌బాబు 25వ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కాబోతుంది. ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఒక పుకారు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

మహేష్‌ 25వ చిత్రం ఒక హాలీవుడ్‌ మూవీని కాపీ కొట్టి తెరకెక్కిస్తున్నాడట. దర్శకుడు వంశీ ఆ మూవీ స్టోరీ లైన్‌ తీసుకుని తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేసి రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. హాలీవుడ్‌ సినిమాలను కాపీ కొట్టడం తెలుగులో ఇది కొత్తేం కాదు. కాని స్టార్‌ హీరో కోసం ఒక హాలీవుడ్‌ మూవీని కాపీ కొట్టడంతో చర్చ మొదలైంది. గతంలో దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు కూడా హాలీవుడ్‌ మూవీ నుండి కాపీ కొట్టినట్లుగా పుకార్లు షికారు చేసి, చివరకు అది నిజమే అని నిర్థారణ కూడా అయ్యింది.