మగవాళ్లకి ప్రవేశం లేని గ్రామం , ఆడవారి కోసమే ఆ గ్రామం, ఎక్కడ ఉందో తెలుసా....     2018-05-30   00:56:41  IST  Raghu V

అక్కడ ఒక మగాడు కూడా ఉండడు , మొత్తం ఆడవల్లే , ఆడవారి కోసం ఏర్పడిన గ్రామం అది. అక్కడ మగవాళ్లకు ఏ మాత్రం ప్రవేశం లేదు. మగవాళ్లు ఊళ్లోకి రావడానికి కూడా వారు ఒప్పుకోరు. గృహహింస, మగాళ్ల వేధింపులు, అత్యాచారాలు, అఘాయిత్యాలకు గురైన మహిళలు , భర్త వదిలేసిన వారు, వితంతువులకు ఈ గ్రామం రక్షణ కల్పిస్తుంది. అలాంటి బాధితులతోనే ఈ ఊరు ఏర్పడిందంటే మహిళలపై అక్కడ జరిగే దారుణాలను అర్థంచేసుకోవచ్చు. మహిళలు, బాలికలకు ఆ గ్రామం స్వర్గం లాంటిది. ఈ గ్రామం కెన్యాలో ఉంది. దాని పేరు ఉమోజా!!

అసలు ఈ గ్రామం వెనక కథ

కెన్యా ఉత్తర ప్రాంతంలో రెబెకా అనే మహిళ 25ఏళ్ల క్రితం కేవలం మహిళల కోసమే ఉమోజా అనే గ్రామాన్ని ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి మహిళల రక్షణ కోసం ప్రయత్నిస్తున్నారు. ఉమోజా గ్రామ ప్రస్తుత చీఫ్ ఆమె. రెబెకా అక్కడి సంబూరు తెగకు చెందిన మహిళ. గతంలో అక్కడ బ్రిటిష్ సైనికులు శిక్షణ పొందేవారట , ఆ సమయంలో వారి అకృత్యాలకు హద్దు ఉండేది కాదట . తదనంతరం అక్కడి పురుషులు కూడా మహిళలను విపరీతంగా కొట్టేవారు. ఓ రోజు గ్రామంలో వ్యక్తులు ఆమెను విపరీతంగా కొడుతుంటే భర్త అడ్డుకోలేదట. ఇక పురుషులకు దూరంగా కొత్త గ్రామాన్ని నిర్మించుకోవాలని అనుకొని 1990లో ఉమోజా గ్రామం ఏర్పాటు కు మొదలుపెట్టారు.క్రమంగా ఎందరో బాధితులు ఆమెతో చేరిపోయారు. గ్రామం ఏర్పాటైంది.