మహేష్‌పై మాధవిలత సంచలన వ్యాఖ్యలు     2018-06-22   23:35:29  IST  Raghu V

బాలీవుడ్‌తో పోల్చితే టాలీవుడ్‌లో మగ డామినేషన్‌ కాస్త అధికం అని చెప్పక తప్పదు. టాలీవుడ్‌లో హీరోల స్థాయిలో హీరోయిన్స్‌కు పారితోషికం ఇవ్వక పోవడంతో పాటు, హీరోయిన్స్‌కు అంతగా గుర్తింపు, ప్రాముఖ్యతను కూడా తెలుగు ఫిల్మ్‌ మేకర్స్‌ ఇవ్వరు. హీరోలకు ఇచ్చినంత గౌరవం మరియు ఫెసిలిటీస్‌ హీరోయిన్స్‌కు ఇవ్వరు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సౌత్‌ నుండి బాలీవుడ్‌కు ఎంతో మంది హీరోయిన్స్‌ వెళ్తారు. అయితే బాలీవుడ్‌ నుండి మాత్రం సౌత్‌కు చాలా తక్కువ మంది హీరోయిన్స్‌ వస్తారు. ఎందుకంటే వారికి ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సి ఉంటుంది, అలాగే హీరో స్థాయిలో వారికి మర్యాదలు చేయాల్సి ఉంటుంది.

తెలుగు సినిమా పరిశ్రమలో హీరోలు కూడా హీరోయిన్స్‌కు ఎందుకు తక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు అంటూ అడిగిన దిక్కు లేదు. ఎన్ని సార్లు, ఎన్ని విధాలుగా హీరోయిన్స్‌ అవమానాలు ఎదుర్కొన్నా కూడా హీరోలు మాత్రం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ హీరోల్లో మహేష్‌బాబు కూడా ఉన్నాడు అని, తన సినిమాలో నటించడం, పూర్తి చేసుకుని వెళ్లి పోవడం మినహా, ఇతర నటీనటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మరియు ఇతరత్ర విషయాలను మహేష్‌ బాబు పట్టించుకోడు అంటూ మాధవిలత సంచలన వ్యాఖ్యలు చేసింది.