ఆ బాలిక‌కు 3వ క‌న్ను ఉంద‌ట..? దాంతో ఎదుటి వ్య‌క్తి గురించి ఆమె పూర్తిగా చెబుతుంద‌ట‌..!  

ఆ బాలిక క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టారు. చుట్టూ ఉన్న జ‌నంలో ఓ వ్య‌క్తి వ‌ద్ద‌కు ఆమెను తీసుకెళ్లారు. అనంత‌రం ఆ బాలిక‌ను ప్ర‌శ్న‌లు అడిగారు. త‌న ఎదురుగా ఉన్న వ్యక్తి వేసుకున్న దుస్తులు ఏమిటి ? వాటి రంగు ఏది ? అత‌ని మెడ‌లో ఏముంది ? అత‌ని శ‌రీరంలో ఉన్న వ్యాధులు ఏమిటి ? అని అడిగారు. అందుకు ఆ బాలిక ఠ‌కీ ఠ‌కీమ‌ని స‌మాధానాలు చెప్పేసింది. దీంతో చుట్టూ ఉన్న‌వారు అది చూసి షాక్ అయ్యారు. ఎదురుగా ఉన్న వ్య‌క్తుల‌ను చూస్తే వారు వేసుకున్న దుస్తులు, వాటి రంగు తెలిసిపోతాయి. కానీ వారి శ‌రీరంలో ఉన్న వ్యాధులు ఎలా తెలుస్తాయి ? అది సాధ్యం కాదు క‌దా..! ఇక మ‌రొక సంద‌ర్భం…

ఆ బాలిక క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టారు. అనంత‌రం డోన‌ట్స్ ఆకారంలో ఉండే ప‌లు రింగుల‌ను ఆమెకు ఇచ్చారు. వాటిని ఒక దానిపై ఒక‌టి పేరుస్తూ వాటి రంగు చెప్ప‌మ‌న్నారు. అంతే.. ఆ బాలిక ఒక్కో రింగును పేర్చుతూ వాటి రంగును చెప్పేసింది. ఆ త‌రువాత ఆ బాలిక క‌ళ్ల‌కు గంత‌లు ఉండ‌గానే ఓ వ్య‌క్తి పేప‌ర్‌పై ఆంగ్లంలో ల‌వ్ (LOVE) అనే అక్ష‌రాల‌ను రాశాడు. అది ఏ ప‌ద‌మో చెప్పాల‌ని ఆ బాలిక‌ను అడ‌గ్గా ఆమె ల‌వ్ అని ట‌క్కున చెప్పేసింది. దీంతో మ‌ళ్లీ షాక్‌.. ఏంటీ ఇప్పుడు మేం చెప్పింది న‌మ్మ‌డం లేదా..! అయితే కింద ఇచ్చిన వీడియో చూడండి.

చూశారుగా… ఇంత‌కీ ఎలా సాధ్య‌మ‌వుతుంది అనేగా మీ డౌట్‌. ఏమీ లేదండీ.. ఆ వీడియోలో ఉన్న బాలిక‌ బెంగుళూరులో ఉన్న ప‌ర‌మ‌హంస నిత్యానంద గురుకుల పాఠ‌శాల విద్యార్థిని. ఆమె పేరు ‘మా యోగ‌మాత‌’. ఆమెకు అక్క‌డ ‘సూప‌ర్ నాచుర‌ల్ ప‌వ‌ర్స్’ అనే అంశంలో శిక్ష‌ణిస్తార‌ట‌. అందుకే ఆమె అలా అసాధ్య‌మైన ప‌నుల‌ను సుసాధ్యంగా చేసింది. ఆమె క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకున్నా ఎదుటి వ్య‌క్తిని స్కాన్ చేస్తుంద‌ట‌. దీంతో అత‌ని గురించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయ‌ట‌. స‌ద‌రు వ్య‌క్తి ఏ దుస్తులు వేసుకున్నాడు, వాటి రంగు ఏమిటి, అత‌ను వేసుకున్న ఆభ‌ర‌ణాలు ఏమిటి, అత‌ని శ‌ర‌రీంలో ఉన్న వ్యాధులు.. తదిత‌ర వివ‌రాల‌ను ఆమె చెబుతుంది. అందుకు ఆమెకు త‌న‌ శ‌రీరంలో ఉన్న 3వ క‌న్ను స‌హాయం చేస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆ బాలిక‌ వీడియో ఇప్పుడు నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తూ వైర‌ల్‌గా మారింది. అయితే కేవ‌లం మా యోగ‌మాత మాత్ర‌మే కాదు, ఆ వీడియోలో చూపించే ఇత‌ర బాలిక‌లు, బాలురికి కూడా ఈమెలాగే శ‌క్తులు ఉన్నాయట‌. ఏది ఏమైనా వీరు ఇలా చేస్తున్నారంటే.. ఇంకా మ‌న‌కు న‌మ్మశ‌క్యంగా లేదు క‌దా..!