ఈ సంవత్సరం ఈ రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది     2018-02-20   22:13:53  IST  Raghu V

Lucky zodiac signs for 2018

2018 ప్రారంభం అయ్యిపోయింది. ఈ సంవత్సరం కొంత మంది జీవితం సాఫీగా సాగుతుంది. మరి కొంతమంది జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది జీవితాల్లో గ్రహాల అనుకూలత కారణంగా ఏ పని చేసిన బాగా కలిసివస్తుంది. అలాగే కొంత మంది జీవితాల్లో గృహాల అనుకూలత లేకపోతే వారి జీవితం చాలా దుర్బలంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఏ పని చేసిన అదృష్టం వచ్చే రాశుల గురించి తెలుసుకుందాం.

మేష రాశి
ఈ రాశివారికి ఈ సంవత్సరమే కాదు వచ్చే సంవత్సరం కూడా చాలా బాగుంటుంది. మకరరాశిలో పదో స్థానంలో శని ఉండడం వల్ల మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరు ఏ పని తలపెట్టిన సక్సెస్ అవుతుంది. వీరి భవిష్యత్ చాలా బాగుటుంది. వీరు పనిచేస్తున్న ఎదగటానికి ప్రయత్నం చేస్తే ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరు దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగితే జీవితంలో ఎదురే ఉండదు.


ధనస్సు రాశి
ఈ రాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ధనస్సు రాశిలో శని రెండో స్థానంలో ఉండుట వలన ఈ రాశి వారికి అనుకూలంగా పనులు జరుగుతాయి. వీరు డబ్బు బాగా సంపాదించటమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. వీరు బాగా సంపాదిస్తారు. అయితే కాస్త సంపాదన మీద కాస్త దృష్టి పెడితే తిరుగు ఉండదు.

మీన రాశి
ఈ రాశివారికి శని పదో స్థానంలో ఉండుట వలన ఈ సంవత్సరం అంతా చాలా సంతోషంగా ఉంటారు. వీరు ఏ పని చేసిన ఏ ఆటంకాలు లేకుండా జరుగుతుంది. చేసే పని మీద ఎక్కువగా ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వీరికి ఏప్రిల్ తర్వాత చాలా బాగుంటుంది. ఏ పని చేసిన తిరుగు ఉండదు. అయితే వీరు నిరుత్సాహం లేకుండా చేసే పని మీద దృష్టి పెట్టాలి. వీరు సృజనాత్మకంగా ఆలోచించే వ్యక్తులతో స్నేహం చేస్తే మంచి జరుగుతుంది.