లో బీపీ ఎందుకు వస్తుందో తెలుసా?    2018-03-20   21:33:53  IST 

సాధారణంగా చాలా మందికి హై బీపీ ఉంటుంది. కొంతమందికి మాత్రం లో బీపీ ఉంటుంది. హై బీపీ ఉన్నవారి కన్నా లో బీపీ ఉన్నవారిలో గుండె జబ్బులు,పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. అందువల్ల లో బిపిని కూడా అశ్రద్ధ చేయకూడదు. అసలు లో బీపీ రావటానికి కారణాలు ఏమిటి? లక్షణాలు ఎలా ఉంటాయి. వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

లో బీపీ రావటానికి గల కారణాలు
స్త్రీలలో గర్భధారణ సమయంలో రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు జరిగి లో బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెలివరీ అయ్యాక నార్మల్ అయ్యిపోతారు. కానీ కొంత మంది నార్మల్ కాకుండా లో బీపీ సమస్యతో బాధపడుతూ ఉంటారు.

గుండె సమస్యలు,గుండె కవాటాల్లో సమస్యలు ఉన్నవారిలో రక్త ప్రసరణ సరిగా జరగక లో బిపికి కారణం అవుతుంది.

ఎండోక్రిన్ గ్రంథిలో సమస్యలు ఉన్నప్పుడు అది లో బిపికి కారణం అవుతుంది.

అలాగే నీటిని ఎంత త్రాగిన డీహైడ్రేషన్ సమస్యతో బాధపడేవారిలో కూడా లో బిపి ఉంటుంది.

కొంతమందిలో ఆహారాలు, మెడిసిన్స్ అలర్జీలు ఉంటాయి. అటువంటి వారిలో కూడా లో బిపి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

లో బిపి లక్షణాలు
తల దిమ్ముగా, మబ్బుగా అనిపించడం, స్పృహ కోల్పోవడం, చూపు మసగ్గా ఉండడం, వికారం, తీవ్రమైన అలసట, నీరసం, ఏకాగ్రత కోల్పోవడం వంటివి లో బీపీ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ లక్షణాలు కనపడగానే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.