జంక్ ఫుడ్ కి మనం అడిక్ట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా.? తల్లి పాలు తాగడం వల్లే.!     2018-06-18   01:00:33  IST  Lakshmi P

సిగరెట్, మందు కి అడిక్ట్ అయినట్టు చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడుతుంటారు. టైం తో పనిలేకుండా బర్గర్ లు, పిజ్జా లు, బేకారి ఐటమ్స్ లాగించేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి మంచిది కాదు అని ఎంత మానేయాలని చూసా మానలేరు. అయితే అలా ఎందుకు మానలేకపోతున్నారా? దాని వెనకాల సైంటిఫిక్ రీసన్ ఉందండోయి. అదేంటో ఒక లుక్ వేసుకోండి.

సహజంగా తల్లిపాలల్లో కార్బొహైడేట్లు, కొవ్వు పదార్థాలు అధికస్థాయిలో ఉంటాయి. అదే మోతాదులో బంగాళాదుంపలు, తృణధాన్యాల్లో ఉండటం వల్ల వాటితో చేసిన ఫ్రెంచ్‌ ఫ్రైస్, కేండీ బార్‌ వంటివి ఎక్కువగా తింటున్నట్లు చెబుతున్నారు. ఈ కార్బొహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు మెదడు వ్యవస్థను తీవ్రంగా ప్రభావితంగా చేస్తాయంటున్నారు.