హనుమంతుడు ఇంకా భూమి మీదే ఉన్నాడు .. ఇవిగో సాక్ష్యాలు Devotional Bhakthi Songs Programs    2017-05-24   01:04:42  IST  Raghu V

పవన పుత్రుడు ఇంకా భూమి మీద నివసిస్తన్నాడా? తన భక్తులకి ఊహించని రూపాల్లో దర్శనమిస్తూ దైవం మీద నమ్మకాన్ని పెంచుతున్నాడా? ఈ విశ్వం ఉన్నంతవరకు రామాయణం గురించి మాట్లాడుకుంటారు అంటారు, అలాగే రామాయణం గురించి జనాలు మాట్లాడుకుంటున్నంతవరకు హనుమంతుడు ఉంటాడంటారు .. మనం ఇంకా రామాయణం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం. మరి హనుమంతుడు ఇంకా భూమి మీద ఉన్నట్టేనా? ఉంటే మన కనులకి ఎందుకు కనబడటం లేదు? అసలు ఉన్నాడా లేదా? ఈ సాక్ష్యాలు చూస్తోంటే ఉన్నాడనే అనిపిస్తోంది.

* హనుమంతుడుకి ఉన్న మరోపేరు చిరంజీవి. అంటే అర్థం ఎప్పటికీ జీవించి ఉండేవాడు. అక్కడే మనకు అర్థం అవ్వాలి, హనుమంతుడు ఎప్పటికి ఇక్కడే ఉంటాడని.

* రామాయణం పూర్తవగానే రాముడు, సీత అంతా భూమిని విడిచి వెళ్ళిపోయారు .. కాని హనుమంతుడు భూమిని విడిచినట్టుగా ఎక్కడా వ్రాసిలేదు.

* హనుమంతుడు సత్య యుగంలో రుద్రుడి రూపంలో ఉండేవాడు. అంటే హనుమంతుడు త్రేతాయుగానికి ముందునుంచే మన పురాణాలకి తెలుసు.

* త్రేతాయుగంలో రుద్రుడు హనుమంతుడిగా జన్మించి, అదే రూపంలో చిరంజీవిగా ఉంటాడని పురాణాలు చెప్పాయి. ఈ యుగంలోనే రామాయణం జరిగింది.