Look how Pawan’s laziness ruined Mahesh – Trivikram’s friendship

ఇండస్ట్రీలో మహేష్ బాబు ఎవరితోనూ పెద్దగా కలవడు. పార్టీల్లో కనిపించడు. మరీ దగ్గరి వారైతే ఫ్యామిలీ ఫంక్షన్స్ లో, పెళ్ళిలలో కనిపిస్తాడు అంతే. అలాంటి మహేష్ బాబుకి ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది స్నేహితుల్లో త్రివిక్రమ్ ఒకరు. అతడు మొదలవడానికి ముందునుంచే ఈ ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. మధ్యలో ఖలేజా లాంటి ఫ్లాప్ వచ్చినా చెక్కుచెదరని వీరి స్నేహానికి ఈమధ్య బీటలు వారిందని సమాచారం. దానికి కారణం పవన్ కళ్యాణ్.

సినిమా ఒప్పుకున్నట్లే కాని మహేష్ కి త్రివిక్రమ్ తో సినిమా మీద పెద్దగా ఆసక్తి లేదట. అందుకే ఇన్నాళ్ళు వాయిదా వేస్తూ వచ్చాడు. నిజానికి ఆగడు తరువాత వీరి సినిమా మొదలవ్వాల్సింది. ఆగడు, శ్రీమంతుడు ఆ తరువాత బ్రహ్మోత్సవం .. మూడు సినిమాలు చేసాడు కాని త్రివిక్రమ్ కి డేట్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా తనని కాదని శ్రీకాంత్ అడ్డాల లాంటి చిన్న దర్శకుడికి అవకాశం ఇచ్చినప్పుడు త్రివిక్రమ్ బాగా నొచ్చుకున్నారట. ఇలాంటి సెన్సిటివ్ కండీషన్లో పవన్ చేస్తున్న ఆలస్యం గొడవని పెద్దగా చేసింది.