ఆయన అప్పులు తీర్చేసి కోట్ల లాభాలు ఇచ్చిన ఎన్టీఆర్

పెద్ద హీరోతో సినిమా అంటే వంద కోట్ల వ్యాపారం. బడ్జెట్ భారీగానే పెట్టాలి. కాని క్లిక్ అయితే మంచి లాభాలుంటాయి. అదే జరిగింది. ఈ సినిమాకి తారక్ రెమ్యునరేషన్ ఇప్పటివరకు తీసుకోలేదట. దాంతో జైలవకుశ బిజినెస్ ముగిసిన తరువాత కళ్యాణ్ రామ్ టేబుల్ మీద మిగిలిందో ఎంతో తెలిస్తే నోళ్ళు ఎండబెడతారు.

ఏకంగా 65-70 కోట్లు మిగిలాయట. జైలవకుశ సాటిలైట్ కలుపుకోని 112 కోట్ల బిజినెస్ చేసింది. సినిమాని 50 కోట్ల లోపే పూర్తి చేసారట. తారక్ పైసా తీసుకోకపోవడం వలనే ఇది సాధ్యపడింది. లాభాలు వస్తేనే నేను డబ్బు తీసుకుంటానని అన్నాడట ఎన్టీఆర్‌. ఇప్పుడు టేబుల్ మీద 65 కోట్లకు పైగా ఉన్నాయి కాబట్టి ఎన్టీఆర్ కి పారితోషికం ఇచ్చేసి, అప్పులన్ని తీర్చుకోవడం పెద్ద సమస్య కాదేమో‌.