ఆయన అప్పులు తీర్చేసి కోట్ల లాభాలు ఇచ్చిన ఎన్టీఆర్

సంతోషంలో ఎవరైనా మనతో ఉంటారు, కాని కష్టాల్లో మనతో ఉండేవారు బంధువులు, ఆత్మీయులు‌. బంధాలు, బంధుత్వాలు కేవలం ఒకే కుటుంబంలో పుట్టగానే పేరుకే ఏర్పడినా, జీవితంలో ఒకరిపట్ల ఒకరం ఎలా ఉన్నాం అనే దాని మీద ఆ బంధానికి విలువ ఉంటుంది. నందమూరి కళ్యాణ్ రామ్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడి, లాభాల బాట పడుతున్నారు. అందుకు కారణం ఎన్టీఆర్.

జైలవకుశ సినిమాకి ముందు కళ్యాణ్ రామ్ అప్పుల్లో ఉన్నారు. ఓం సినిమా నుంచి మొదలైన అప్పులు, పటాస్ లాంటొ బ్లాక్ బస్టర్ తో కూడా తీరలేదు‌. ఇక రవితేజ కిక్-2 చేసిన గాయం అలాంటిది ఇలాంటిది కాదు. పీకల్లోతు కష్టాల్లో పడిపోయారు‌. అలాంటి సమయంలో అన్నని ఆదుకోవడానికి వచ్చాడు యంగ్ టైగర్. కళ్యాణ్ రామ్ కి జైలవకుశ ప్రాజెక్టు ని ఇచ్చాడు తారక్.