లోకేష్ షాకింగ్ కామెంట్స్..పవన్ పై పరువునష్టం దావా?     2018-03-20   08:04:54  IST  Bhanu C

Lokesh strong warning to Pawan kalyan

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొన్నిరోజుల క్రితం గుంటూరు సభలో లోకేష్ పై ఏపీ సీఎం చంద్రబాబు పై చేసిన వ్యాఖ్యలు అందరికీ గుర్తు ఉండే ఉంటుంది..లోకేష్ ఎంతో అవినీతి పరుడు..లోకేష్ విషయంలోనే మోడీ చంద్రబాబు కి అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు..ఆ వ్యాఖ్యలు టిడిపి కి ఎంతటి నష్టాన్ని తీసుకోచ్చాయో వేరేగా చెప్పనవసరం లేదు..అయితే టిడిపి అధినేత చంద్రబాబు ఈ విషయంపై స్పందిచారు..పవన్ కళ్యాణ్ జగన్ మాదిరి ఆరోపణలు చేయడం సరైన పద్దతి కాదు..ఆధారాలు ఉంటే చూపించండి అంటూ సవాల్ విసిరారు..అయితే ఇప్పుడు ఇదే విషయంపై లోకేష్ కూడా స్పందిచారు..పవన్ కళ్యాణ్ పై లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు..

మాపై నిరాధార ఆరోపణలు చేసి..టిడిపి పార్టీ పరువుకి మా వ్యక్తిగత పరువుకి భంగం కలిగించారు ఈ విషయంపై పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది..అన్ని అంశాలని పరిశీలించి త్వరలో పరువునష్టం దావా వేయడానికి సిద్దంగా ఉందని అన్నారు..ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చలకి దారితీస్తున్నాయి..ఈ విషయంలో పార్టీ ఎంతో సీరియస్ గా ఉందని లోకేష్ తెలిపారు…మంగళవారం ఉదయం లోకేష్ మీడియాతో మాట్లాడారు.. ఏపీ ప్రజలు ఎంతోతెలివైన వారని..ఎవరు ఏమి చెప్తే నమ్మేవాళ్ళు కాదని ఈ విషయంలో మాకు ప్రజలే నిర్ణేతలని..పవన్ కళ్యాణ్ ఇచ్చే సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు..

అయితే తనతో పాటు ఫోతోలౌన్నది ఎవరనే విషయంపై పవన్ కి దిమ్మతిరిగే రిప్లై ఇచ్చారు లోకేష్..తనతో ఫొటోలో ఉంది ప్లానింగ్ కమిషన్ సభ్యుడు పెద్ది రామారావు అని..పెద్ది రామారావు అని అయితే ఆ ఫోటోలో ఉంది శేఖర్‌రెడ్డి అని ప్రచారం చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు..ప్రతీఏటా ఆస్తులు ప్రకటిస్తున్న నేను ఎంతటి నిజాయితిగా ఉంటానో ఏపీ ప్రజలకి తెలుసునని అన్నారు…ప్రకటించిన వాటికంటే ఎక్కువగా ఆస్తులు ఉంటే తీసుకుని వెళ్లిపోవచ్చని చాలెంజ్ చేశారు.. లోకేష్ చేసిన ఈ వ్యాఖలు ఇప్పుడు ఏపీ రాజకేయాల్లో సంచలనం అవుతున్నాయి..అయితే ఈ వ్యాఖ్యలకి జనసేన నేతలు ఎలాంటి స్పందన తెలుపుతారో వేచి చూడాలి మరి..