లోకేష్ స్పీడు చూసి షాక్ అవుతున్న సీనియర్స్     2018-07-05   02:42:59  IST  Bhanu C

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన తరువాత.ఎన్నో విమర్శలు…మరెన్నో అవమానాలు..అప్పటి వరకూ కార్పోరేట్ సెక్టార్ లో ఉన్న లోకేష్ ఒక్క సారిగా రాజకీయాల్లోకి వచ్చే సరికి రాజకీయ ప్రత్యర్ధులు చేసే మాటల దాడులకి అప్పట్లో పార్టీ సీనియర్స్ లోకేష్ కి రక్షణ కవచంలా అడ్డుగా ఉండేవారు..ఎమ్మెల్సీ ఎన్నికల సమయమే లోకేష్ రాజకీయాల్లోకి రావడానికి సరైన సమయం అని భావించిన చంద్రబాబు ఆ సమయంలో లోకేష్ ని ఎమ్మెల్సీ గా చేసి ఆపై మంత్రిగా చేశారు..

అయితే ప్రమాణ స్వీకారం మొదలు లోకేష్ ఎప్పుడు ఎక్కడ ఏమి మాట్లాడినా సరే ఆ మాటల్లో తప్పులు వెదుకుతూ ఒకటికి రెండింతలు చేస్తూ ఇలాంటి వాడా మంత్రిగా ఉంది అంటూ వైసీపి వాళ్ళు చేసిన దుష్పరచారం అంతాఇంతా కాదు సోషల్ మీడియా నుంచీ వెబ్ మీడియా వరకూ కూడా లోకేష్ ని టార్గెట్ గా చేసుకుని ఎన్నో నిందలు వేశారు..అయితే లోకేష్ పై ఆరోపణలు చేసిన ప్రతీ సారి పార్టీలో సీనియర్స్ మాట్లాడటం లోకేష్ ఒక్క విషయంలో కూడా ఖండించక పోవడంతో పార్టీలోని కార్యకర్తలు సైతం నిరుశ్చహానికి లోనయ్యారు.