Lokesh shocking commetns on Brahmani political entry

సరిగ్గా ఏడాది క్రితం..బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ చేస్తుంది అని ఆ ఎంట్రీ కూడా గుంటూరు నుంచీనే ఉంటుంది అని గుంటూరు ఎంపీ గా బ్రాహ్మణి కనిపించబోతుంది అనే ఊహాగానాలు తెలుగు రాష్ట్రాలలో హల్చల్ చేశాయి..మీడియా అయితే బ్రాహ్మణి ఎంట్రీ చేస్తే ఎలా ఉంటుంది..ఎక్కడ నుండీ తన పోటీ ఉంటే బాగుంటుంది..ఇలా అనేక కధనాలని వెల్లడించాయి..అప్పటికి తెలుగుదేశం నుంచీ ఒక్క మాట కూడా ఈ విషయంలో కూడా బయటకి రాలేదు..వార్తలు మరీ ఎక్కువగా రావడంతో బ్రాహ్మణి ఈ ఊహాగానాలకి తెరదించింది..నేను రాజకీయాల్లోకి రావడానికి ఆశక్తిగా లేను అని చెప్పింది.

మళ్ళీ ఇన్ని నెలలకి బ్రాహ్మణి ఎంట్రీ పై అనేక కధనాలు మళ్ళీ వస్తున్నాయి..ఈ సారి ఈ కధనలకి వేదికగా తెలంగాణ అయ్యింది.. తాజాగా తెలంగాణ‌లో పార్టీ స్థితిగ‌తుల‌పై చ‌ర్చించ‌డానికి చంద్ర‌బాబు ట్ర‌స్ట్ భ‌వ‌న్‌కు వ‌చ్చారు. ఎవ్వ‌రూ అధైర్య ప‌డాల్సిన ప‌నిలేద‌ని, తాను అండ‌గా ఉంటాన‌ని ధైర్యం చెప్పారు. ఇంత‌లోనే ఉన్నట్లుండి తెలుగు తమ్ముఢు ఒకరు బ్రాహ్మణి ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రకాశ్ రెడ్డి అనే మీడియా బాధ్యతలు చూసే నేత మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పార్టీని బ్రాహ్మణికి అప్పగించాలన్న కోరికను బయటపెట్టారు.

ఇప్పుడు తాజాగా లోకేష్ బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ షాకింగ్ అవుతున్నాయి.మీడియా ముందుకి వచ్చిన లోకేష్ కి వారు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నారు..ఇంతలో ఒక మీడియా మిత్రుడు బ్రాహ్మణి రాజకీయ అరంగేట్రం గురించి అడగగా..తన భార్య బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తానంటే నేను ఆహ్వానిస్తాను అని బ్రాహ్మణి ఇప్పుడు బిజినెస్ వ్యవహారాలూ చూసుకుంటోంది..చాలా తెలివైనది అని సమాధానం చెప్పారు..లోకేష్ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నని ఖండించలేదు..పైగా వస్తే మంచిదే అన్నారు అంటే త్వరలో తప్పకుండ బ్రాహ్మణి ఎంట్రీ ఉంటుంది అన్న మాట నిజమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.