రేవంత్ తో పాటు భారీ వలసలు..లిస్ట్ ఇదే     2017-10-20   05:53:50  IST  Bhanu C

List of TDP MLAs into Congress

రేవంత్ రెడ్డి తెలుగుదేశాన్ని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళడం ఖాయం అయ్యింది.అయితే తానూ ఒక్కడే కాంగ్రెస్ లోకి వెళ్ళడంలేదని కొందరు యువనేతలు రేవంత్ బాటలోనే నడుస్తారు విషయం గుప్పుమంది..రేవంత్ రెడ్డి నిర్ణయానికి మేముకూడా మద్దతు పలుకుతున్నాం..టీ –టిడిపి టీఆర్ఎస్ తో కలిసి చెట్టాపట్టాలు వేసుకుంటే ఆ పార్టీలో ఉండే సీనియర్ నాయకులూ మమ్మల్ని ఎదగనివ్వరు అని వారు బహిరంగానే అంటున్నారట అందుకే నెమో మేము కూడా రేవంత్ బాటలోనే కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి సిద్దపడ్డాము అని అంటున్నారు. రేవంత్ తో పాటు వాళ్ళు ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిసిన సమయంలో తన వెంట వచ్చే నేతలకు కూడా టిక్కెట్లు ఇచ్చే విషయంపై ఒక క్లారిటీ తీసుకున్నారట. అయితే మీరు పార్టీలోకి వచ్చే సమయంలో భారీ వలసలు..అధికార పక్షం నుంచీ టి –టిడీపి నుంచీ ఉండాలని రాహుల్ గాంధీ సూచించారట.

రాహుల్ కోరికమేరకు ఢిల్లీ నుంచేకధ నడిపిన రేవంత్ వేగంగా సమీకణాలని మార్చేశారు..ఎవరెవరికి ఎటువంటి హామీలని ఇచ్చారనేది పక్కనపెడితే..రేవంత్ తో పాటు కాంగ్రెస్ లోకి వెళ్లేవారి లిస్టు చాలా భారీగానే ఉందని తెలుస్తోంది. సుమారుగా 16 జిల్లాల టీడీపీ అధ్యక్షులతో పాటు, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నేతలు కూడా కాంగ్రెస్ లో చేరనున్నారని సమాచారం.ఈ వలసలు ముఖ్యంగా కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట¸ వికారాబాద్, మేడ్చల్, భూపాలపల్లి, జిల్లాల నుంచి ఫిరాయింపులు అధికంగా ఉండవచ్చని అని అంచనా.ఒకవేళ ఈ పదహారు జిల్లా నేతలు ఒకేసారి కాంగ్రెస్ లోకి జంప్ అయితే తెలంగాణలో టిడీపి పని ఖాళీనే అని తెలుస్తోంది.