LIE Movie Review

చిత్రం : లై
బ్యానర్ : 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్
దర్శకత్వం : హను రాఘవపుడి
నిర్మాతలు : గోపి ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకర
సంగీతం : మణిశర్మ
విడుదల తేది : ఆగష్టు 11, 2017
నటీనటులు : నితిన్, అర్జున్, మేఘ ఆకాష్, శ్రీ రామ్ తదితరులు

కథలోకి వెళితే :


పద్మనాభం (అర్జున్) ఒక బడాబాబు. చాలా తెలివిమంతుడు కూడా. కాని ఇతనికి ఓ వెరైటి అబ్సెషన్ ఉంటుంది. సినిమాలోని డైలాగ్ లాగా, బలహీనత లేని బలవంతుడిని భగవంతుడు ఇప్పటివరకు సృష్టించలేదు. ఈ బలవంతుడికి కూడా ఓ బలహీనత ఉంది.

మరోవైపు సత్యం (నితిన్) పచ్చి అబద్ధాలకోరు. నా పేరు దయ, నాకు లేనిదే అది అన్నట్లు సత్యం అన్ని అబద్ధాలే చెబుతాడు. ఇతడికి అబద్ధాలకి పడిపోయే అమ్మాయి చైత్ర (మేఘా ఆకాష్). వీరి ప్రేమకథ సాఫీగా సాగుతున్నప్పుడు నితిన్ చేతికి ఓ సూట్ కేసు దొరుకుతుంది. ఆ సూట్ కేసు కోసం ఏ.సత్యం జీవితంలోకి ఎంటర్ అవుతాడు విలన్. అసలు ఆ సూట్ కేసులో ఏముంది ? పద్మనాభంకి దానితో ఉన్న అవసరం ఏమిటి ? ఆద్యంతం ట్విస్టులతో సాగే ఆ కథేంటో తెర మీద చూడండి.

నటీనటుల నటన :


నితిన్ ఫుల్ బియర్డ్ లుక్ లో రఫ్ అండ్ స్టైలిష్ గా కనిపించాడు. చాలా రెఫ్రెషింగ్ లుక్ ఇది. అలాగే నటనపరంగా కూడా ఆకట్టుకుంటాడు. నితిన్ కి ఉన్న మైనస్ పాయింట్స్ లో ఒకటి డైలాగ్ డెలివరి. కాని సినిమాలో చాలా ఇంప్రూవ్ మెంట్ కనిపిస్తుంది. నితిన్ కి బాగా ఉపయోగపడే సినిమా. మేఘా ఆకాష్ అందంగా ఉంది. డీసెంట్ గా నటించింది. కాని ఎదో మూలా, అందరు హీరోయిన్ల మాదిరి అనిపించదు. కాబట్టి మాస్ ఆడియెన్స్ నుంచి ఏమైనా కంప్లయింట్స్ ఉంటే ఉండొచ్చు.

అర్జున్ విలనిజం సూపర్. కొన్ని సీన్స్ లో నితిన్ ని కూడా డామినేట్ చేసేసారు యాక్షన్ కింగ్. అర్జున్ పాత్ర ఖచ్చితంగా సినిమాకి మేజర్ హైలెట్. ఆ పాత్రస్వభావం లేకపోతే ఈ కథ పుట్టేదే కాదు. చాలాకాలం తరువాత శ్రీరామ్ కనిపించి డీసెంట్ పాత్ర చేసాడు. ఎప్పటిలాగే తెలుగు సినిమాల్లో రవికిషన్ మెప్పించలేకపోతాడు.