ముఖ చర్మ రంగు అంతా ఒకేలా ఉండాలంటే నిమ్మ పేస్ పాక్స్     2018-05-10   23:22:55  IST  Lakshmi P

మనం సాధారణంగా ముఖం కాంతివంతంగా ఉండటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటాం. అలాగే ఖరీదైన కాస్మోటిక్స్ కూడా వాడుతూ ఉంటాం. అయినా పెద్దగా ఉపయోగం కనపడదు. అంతేకాక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి.అయితే ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే నిమ్మరసంతో కొన్ని ఫేస్ ఫాక్స్ వేసుకుంటే ముఖ చర్మం అంతా ఒకే రీతిలో ఒకే రంగులో ఉంటుంది. ఇప్పుడు ఆ ఫేస్ ఫాక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ కలబంద జ్యూస్ లో ఒక గుడ్డు తెల్లసొన,ఒక స్పూన్ నిమ్మరసం,చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటిలో శుభ్రం చేసుకోవాలి. ఆ తరవాత ముఖానికి మాయిశ్చరైజర్ రాయాలి.