ఆకుకూరలతో జుట్టుకు పాక్స్ ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?  

ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిదని మనకు తెలిసిన విషయమే. ఆకుకూరల్లో ఉండే పోషకాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అవే పోషకాలు జుట్టు సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి. జుట్టు రాలే సమస్య,చుండ్రు,తెల్లజుట్టు సమస్య వంటివి తగ్గుతాయి. అయితే ఆకుకూరలను ఎలా పాక్స్ గా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

గోరింటాకు పొడిలో ఒక కప్పు డికాషన్,ఒక స్పూన్ లవంగాల పొడి,ఒక గుడ్డు,కొంచెం పెరుగు,ఒక స్పూన్ ఆముదం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని తలకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానము చేయాలి. జుట్టు ఆరాక నూనె రాసి మసాజ్ చేయాలి. ఈ విధంగా చేయటం వలన జుట్టు రాలటం తగ్గుతుంది. అలాగే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

రెండు కప్పుల అవిసె ఆకులలో ఒక కప్పు గోరింటాకు , అర కప్పు ఉసిరిపొడి వేసి మెత్తని పేస్ట్‌గా తయారుచేయాలి. ముందుగా తలకు నూనె రాసి 5 నిముషాలు మసాజ్ చేయాలి. ఆ తర్వాత పైన తయారుచేసుకున్న పేస్ట్ తలకు అపట్టించి 20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

మజ్జిగలో ఒక కప్పు చింతచిగురు, ఒక కప్పు గోరింటాకుపొడి తీసుకొని దానిలో అరకప్పు శనగపిండిని కలపాలి. దీనిని మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత తలను కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌లా పనిచేస్తుంది.