జ‌గ‌న్‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌పై అనుమానం? రీజ‌నేంటంటే.!     2018-06-29   23:26:34  IST  Bhanu C

అవును! విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత జ‌గ‌న్‌లో నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయా? ఇప్పుడు ఇదేఅంశంపై చ‌ర్చ న‌డుస్తోం ది. ఆయ‌నలో నాయ‌క‌త్వ ల‌క్షాలు ఉండి ఉంటే.. ఆయ‌న‌నే సొంత అన్న‌య్య‌గా భావించిన వారు, ఆయ‌న‌నే త‌మ నేత‌గా అంగీక‌రించిన వారు పార్టీ నుంచి బ‌య‌ట‌కు ఎందుక వ‌స్తారు? అనేది ప్ర‌ధాన ప్ర‌శ్న‌గా మారిపోయింది. దాడి వీర‌భ‌ద్ర‌రావు వంటివారు ఫ్యామిలీతో స‌హా వెళ్లి వైసీపీలో చేరారు. అయితే, కొన్నిరోజుల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న పార్టీకి రాం రాం చెప్పారు.

ఇక‌, వైసీపీ త‌ర‌ఫున ఎంపీగా గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి గెలిచిన వెంట‌నే క‌నీసం జ‌గ‌న్ మొహం కూడా చూడ‌కుండా పార్టీని విడిచి పెట్టారు. ఇక‌, పార్టీలోకి వెళ్లిన ఉత్త‌రాంధ్ర‌లో మంచి ప‌లుకుబ‌డి ఉన్న నాయ‌కుడు కొణతాల రామ‌కృష్ణ ఈయ‌న కూడా పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. అదేవిధంగా 22 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచి పెట్టారు. ఎంపీ బుట్టా రేణుక జ‌గ‌న్ నియంతృత్వాన్నిభ రించ‌లేక పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. కొత్త‌ప‌ల్లి గీత అర‌కు నుంచి వైసీపీ జెండాపై గెలిచి కూడా పార్టీ కార్యాల‌యం గ‌డ‌ప తొక్క‌లేదు.