Lavanya Tripathi is ready for Bikini and kissing

అందాల రాక్షసితో పరిచయమైన లావణ్యని మొదట అంతా హోమ్లీ గర్ల్, కేవలం హోమ్లీ పాత్రలే చేయగలదు అనుకున్నారు. కాని అప్పటికి చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, లావణ్య సినిమాల్లోకి రాకముందు బికినీ ఫోటోషూట్లు చేసిన మోడల్. మరి అలాంటి అమ్మాయి కేవలం హోమ్లీ పాత్రలు, అభినయం మీదే ఎందుకు ఆధారపడుతుంది ? కాని అదేంటో, లావణ్య బ్యాక్ గ్రౌండ్ తెలిసి కూడా ఆమెకి ఎక్కువ హోమ్లీ పాత్రలే ఇచ్చారు. దాంతో రెండుమూడు సార్లు తనకు గ్లామర్ పాత్రలు కావాలి, చీరలు కట్టి కట్టి బోర్ కొట్టిందంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది లావణ్య. ఆ మాట వినే కావచ్చు, శర్వానంద్ రాధలో ఈ హీరోయిన్ కి గ్లామర్ ఒలికించే అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

అయితే లావణ్య గ్లామర్ ఆశలు ఇక్కడితో ఆగలేదు. ముద్దు సీన్లకి కూడా రెడీ అంటోంది. కథకి అవసరమనిపిస్తే పరిమితుల్లో గ్లామర్ పాత్రలు చేయడానికైనా, కిస్సింగ్ సీన్స్ చేయడానికి అయినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, స్మూచ్ సీన్స్ కి కూడా అడ్డు చెప్పనని, కాని ఆ సీన్లు వల్గర్ గా ఉండకుండా, హాట్ గా ఉంటే చాలని అంటోంది లావణ్య.

కిస్సింగ్ మాత్రమే కాదు, బికినికి కూడా అస్సల అడ్డు చెప్పేది లేదంట. ఎలాగో మోడలింగ్ రోజుల్లో బికిని లావణ్యకి అలవాటే. కాబట్టి ఇదేమి కొత్త కాకపోవచ్చు కాని లావణ్య ఇమేజ్ కి అలవాటు పడ్డవారు సడెన్ గా ఆమెలోని మరో యాంగిల్ చూస్తే షాక్ అవాల్సిందే. చూడాలి మరి .. లావణ్యకి చీర స్థానంలో బికిని డిజైన్ చేయించే దర్శకుడు ఎవరో.