Last day for Aadhar – PAN linkage .. how to do it ?

చిన్న నుంచి పెద్ద .. ప్రతి విషయంలో ఆధార్ లింకేజ్ ని కంపల్సరి చేస్తున్న భారత ప్రభుత్వం, ట్యాక్స్ చెల్లించేవారి విషయంలో ఆధార్ – పాన్ కార్డు లింకేజి తప్పనిసరి చేసిన విషయం విదితమే. ఆ లింకేజి చేసుకోవాల్సిన చివరి తేది ఈరోజే. ఇప్పటికే 2.07 కోట్ల మంది ట్యాక్స్ పెయర్స్ ఈ లింక్ పని పూర్తీ చేసుకున్నారు. దేశంలో 25 కోట్లమంది పాన్ కార్డు హోల్డర్స్ ఉంటే, 111 కోట్ల మంది దగ్గర ఆధార్ కార్డు ఉంది. మరి మీరు ట్యాక్స్ కట్టేవారే అయితే, ఈ రోజే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ ఆధార్ కార్డుని మీ పాన్ కార్డుతో లింక్ చేసుకోండి. ఒకవేళ ఎలా చేసుకోవాలి మీకు తెలియకపోతే రెండు పద్ధతులు ఉన్నాయి చూడండి.

మొదటి పధ్ధతి :

* E filing వెబ్ సైట్ లోకి వెళ్ళండి. వెళ్లి ఎడమవైపు ఉన్న Link Aadhar మీడ్ద క్లిక్ చేయండి.

* మీ ఆధార్ నంబర్ అలాగే పాన్ కార్డు నంబర్ ఎంటర్ చేయండి.

* మీ ఆధార్ కార్డు మీద ఎలాగైతే మీ పేరు నమోదు అయ్యి ఉందొ, అచ్చం అలాగే స్పెల్లింగ్ తప్పు లేకుండా ఎంటర్ చేయండి.

* అంతే, ఈ ప్రాసెస్ పూర్తీ. కాసేపటికే మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.