“ఎన్నారై” లు ఇక ఆగండి.. “అమెరికా బాటలో కువైట్”     2018-05-09   03:58:03  IST  Bhanu C

నిన్న మొన్నటి వరకూ ఎన్నారై లకి అడ్డుకట్ట వేయాలని భావిస్తూ అందుకు తగ్గట్టుగానే వీసాల జారీ విషయంలో ఎన్నో ఆంక్షలు పెడుతూ భారతీయ వలసదారులే టార్గెట్ గా అమెరికా చేస్తున్న ప్రయత్నాలు అందరికీ తెలిసినవే..అయితే ఇప్పుడు అదే బాటలో కువైట్ ప్రభుత్వం సైతం అడుగులు వేయడం ఎంతో మంది వలస దారులకి ఆందోళన కలిగిస్తోంది..వివరాలలోకి వెళ్తే..

Insert Img

అన్ని దేశాలలో కంటే కంటే భారత్ నుంచీ ఇతర దేశాలకి వలసలు వెళ్ళే వారిలో భారతీయులే అధికంగా ఉంటారు..అయితే గల్ఫ్ వంటి దేశాలలో ఎక్కువగా భవన నిర్మాణాలు భారీ స్థాయిలో జరుగుతూ ఉంటాయి..దాంతో అవసరమైన లేబర్‌ను భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి గల్ఫ్ దేశాలకు రప్పిస్తుంటారు..దాంతో అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగవకాశాలు ఉండేవి. అయితే ఇప్పుడు రాను రాను పరిస్థితులు తల్లకిందులు అవుతున్నాయి..కువైట్ ప్రభుత్వం ఈ వలసల విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు రంగం సిద్డం చేసింది..