విజయ్‌కి వరుస ఛాన్స్‌ల వెనుక కేటీఆర్‌?     2018-06-25   22:10:11  IST  Raghu V

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ ఇవ్వడం దాదాపు అసాధ్యం. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప బ్యాక్‌ గ్రౌండ్‌ లేనివారు తెలుగు సినిమా పరిశ్రమలో హీరోగా ప్రస్తుతం గుర్తింపు తెచ్చుకోవడం కష్టం. అలాంటిది ఒక సామాన్యమైన వ్యక్తిగా పేర్కొనే విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా మారిపోయాడు. మొన్నటి వరకు ఈయన కష్టపడి, మెల్ల మెల్లగా సినిమాలు చేసుకుంటూ పైకి వచ్చాడని అంతా అనుకుంటున్నారు. అయితే తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం విజయ్‌ దేవరకొండకు వరుసగా వస్తున్న ఆఫర్ల వెనుక మంత్రి కేటీఆర్‌ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రంలో చిన్నదైన ముఖ్యమైన పాత్ర పోషించిన విజయ్‌ ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ చిత్రంతో స్టార్‌ అయ్యాడు. సామాన్యుడికి సక్సెస్‌ దక్కినా ఆ తర్వాత మంచి ఆఫర్లు రాకున్నా, సక్సెస్‌లు దక్కకున్నా కూడా కనుమరుగవుతారు. అయితే ‘పెళ్లి చూపులు’ చిత్రం తర్వాత విజయ్‌ దేవరకొండకు అనుకోని అవకాశం అన్నట్లుగా ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంను చేసే అవకాశం దక్కింది. ఆ చిత్రంతో ఏకంగా టాలీవుడ్‌లోనే మోస్ట్‌ వాంటెడ్‌ హీరో అయ్యాడు. ఎప్పుడెప్పుడు ఈయన సినిమా వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈయనతో సినిమాలు నిర్మించేందుకు పలువురు నిర్మాతలు క్యూలు కడుతున్నారు.