ఎమ్మెల్యేలని కడిగిపారేసిన కేటీఆర్..     2017-10-15   02:09:02  IST  Bhanu C

Ktr serious warning to MLA

తెలంగాణా రాజకీయాల్లో కేసీఆర్..ఎంత ఫేమస్ అనేది..వేరేగా చెప్పనవసరం లేదు..ఇప్పుడు అదే రీతిలో వెళ్తున్నారు.పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల..తారకరామారావు..కేటీఆర్. ముఖ్యమంత్రి కొడుకుగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఆయన…తనదైన శైలిలో ప్రజా సమస్యలపై స్పందించే తీరు..మాట్లాడే విధానం..ఒక్కోసారి తండ్రిని మించిన తనాయుడిగా కనిపిస్తాడు.

శనివారం వరంగల్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో…చేపడుతున్న..స్మార్ట్‌, సిటీ, హృదయ్, అమృత్, డబుల్‌ బెడ్రూం పథకాలపై సమీక్ష నిర్వహించారు. వరంగల్‌కు కేటాయించిన రూ. 300 కోట్లను ఇప్పటీకీ ఖర్చు చేయకపోవడంతో మంత్రి కేటీఆర్‌ ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు.. ‘సారీ… మీ వ్యవహారం ఏం బాగాలేదు. వేలకోట్ల నిధులున్నా ఒక్క పైసా ఖర్చుచేయటం లేదు అంటూ కడిగేసారు.

రెండున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రి.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఇంత నిర్లక్ష్యమా… ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకేం సమాధానం..చెబుతామనుకుంటున్నారు..అధికారుల మీదకి నిందలు వేయద్దు..వాళ్ళు అరవై ఏళ్లు ఉంటారు..మరి మీరు.. వచ్చే ఎన్నికల్లో పోటీ పడాల్సిన వాళ్ళు ఇలా చేస్తే పార్టీకి మీవల్ల నష్టం రాదా..ఏం చేద్దాం అనుకుంటున్నారు పార్టీని అంటూ వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ను ఉద్దేశించి ‘ఎమ్మెల్యే గారు, మీరు రోజూ హైదరాబాద్‌ వస్తారు. ఇక్కడేమో పనులు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులకు కొదవలేదు.మరి మీరు ఎందుకు ప్రజల అవసరాలు గుర్తించరు అంటూ తలంటేశారు కేటీఆర్..