KRK criticises Allu Arjun for his looks

పవన్ కళ్యాణ్, ప్రభాస్, రానా దగ్గుబాటి, ధనుష్ .. వీళ్ళ తరువాత బాలివుడ్ వివాదస్పద క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) ట్వీట్స్ కి బలైపోయాడు స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్. ఈ చిత్రివిచిత్రమైన క్రిటీక్ ఏం చేసిన సంచలనాత్మకమే. ట్విట్టర్ లో పబ్లిక్ గా బాలివుడ్ సెలబ్రీలను, క్రికెటర్స్ ని, రాజకీయ నాయకులకి బండ బూతూలు తిట్టే ఇతను, ఇక దక్షిణాది నటులంటే అవమానంలో డోసు పెంచుతాడు.

సర్దార్ గబ్బర్ సింగ్ హిందీ విడుదల సమయంలో కేఆర్కే చేసిన రచ్చ అంతాఇంతా కాదు. పవన్ కళ్యాణ్ హీరో ఏంటి, పవన్ కళ్యాణ్ లాంటోళ్ళు బాలివుడ్ లో సైడ్ క్యారక్టర్లకి కూడా పనికిరారు అంటూ ఎద్దేవ చేసిన సంగతి మీకు గుర్తుకు ఉండే ఉంటుంది. అక్కడితో ఆగకుండా సర్దార్ గబ్బర్ సింగ్ నష్టాల్ని బాలివుడ్ మొత్తం తెలిసేలా ప్రచారం చేసాడు. ప్రపంచంలోనే అత్యంత చెత్త హీరో అంటూ ధనుష్ ని తిట్టాడు. బాహుబలి 2 చెత్త సినిమా అన్నాడు. రానా, ప్రభాస్ తనముందు ఎందుకు పనికిరారు అన్నాడు. ఇప్పుడు కొత్తగా బన్ని మీద పడ్డాడు.

సల్మాన్ ఖాన్ సినిమా కంటే పెద్ద ఓపెనింగ్ రావడంతో ఈమధ్యకాలంలో బన్ని పేరు బాలివుడ్ లో బాగా వినబడుతోంది. ఆ విషయం కేఆర్కేకి నచ్చలేదేమో, “ఈరోజు నాకు ఒకడు చెప్పాడు ఇంత చెత్తగా కనిపిస్తున్న అల్లు అర్జున్ తెలుగులో పెద్ద స్టార్ అని. బాలివుడ్ కి రావలంటే చిన్న చిన్న రోల్స్ చేయాలి ఇక్కడ” అంటూ ఎద్దేవా చేసాడు. బన్ని ఇవన్ని పట్టించుకోకపోతేనే మంచిది. ఎందుకంటే బాలివుడ్ లో కేఆర్కే అంటే కుక్కతో సమానం.