ఆ ఫోటో వల్ల 1 హీరోయిన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.! అందులో తప్పేంటో తెలుసా.?  

“ఆవ్ తాజా మోగ్ కర్తా” అనగానే మనకు గుర్తొచ్చే హీరోయిన్ “కృతి సనన్”. తెలుగులో చేసిందే రెండే సినిమాలు కానీ బాగానే గుర్తింపు సంపాదించింది. మహేష్ బాబు సరసన 1 నేనొక్కడినే సినిమాలో జర్నలిస్ట్ గా అందరిని ఆకట్టుకుంది. తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ సినిమాలో నటించింది కానీ పెద్దగా హిట్ అవ్వలేదు. దీంతో ఈ హీరోయిన్ బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే…సెలెబ్రిటీలు అన్నాక వివాదాలకు గురవడ్డం చాలా కామన్ కదా. వారు ఏం చేసిన మీడియా వారి వెంటనే తిరుగుతూ ఉంటుంది. ఏం చేస్తే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయి అర్ధం కాదు. అలాగే ఇప్పుడు సరికొత్తగా కృతి సనన్ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. దానికి కారణం ఆమె దిగిన ఓ ఫోటో.

వివరాలలోకి వెళ్తే. ఇటీవల ఓ మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం కృతి సనన్‌ హాట్ పోజిచ్చింది. కానీ.. కృతి పోజు వెనుక ఓ జిరాఫీ బొమ్మని వేలాడదీసి ఉండటంతో జంతు ప్రేమికులు, అభిమానులు ఈ ముద్దుగుమ్మని ట్రోల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆ మ్యాగజైన్ సంస్థ తాజాగా కృతి సనన్ ఫొటోలని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ‘తొందరగా నేను కోపం తెచ్చుకోను. కానీ.. మహిళలపై జరిగిన దురాగతాల గురించి చదివినప్పుడు మాత్రం కలత చెందుతాను’ అని సదరు సంస్థ రాసుకొచ్చింది. కానీ.. మహిళల వేధింపుల గురించి మీరు చెప్తున్నప్పుడు.. జంతువుల్ని హింసిస్తున్నట్లు ఫొటోలో ఎలా చూపిస్తారు..? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి!