Kriti Sanon fires on body shaming comments by an actress

సినిమా ప్రపంచంలో గ్లామర్ కి ఉన్న ముఖ్యత వేరు. అందులోనూ బాలివుడ్ లో బాడి కొలతల పిచ్చి ఎక్కువ. అందుకే మీరు చూడండి, దాదాపుగా ప్రతీ బాలీవుడ్ హీరోకి కండలు తిరిగిన దేహం ఉంటుంది. దాదాపుగా ప్రతీ హీరోయిన్ కి బికినీ ఫిగర్ ఉంటుంది. ఓ హీరో బక్కచిక్కినా కామెంట్ చేస్తారు, బరువెక్కినా కామెంట్ చేస్తారు, హీరోయిన్ లావెక్కినా కామెంట్ చేస్తారు, జీరో సైజ్ కి వెళ్ళిపోయినా కామెంట్ చేస్తారు. ఏమిటో బాడి మీద అంత పిచ్చి. ఇలా ఒకరి శరీరంపై చులకనగా కామెంట్ చేయడాన్ని బాడీ షేమింగ్ అని అంటారు. కొత్తగా బాడిషేమింగ్ కామెంట్స్ కి బలైంది బాలివుడ్ బ్యూటి, 1- నేనొక్కడినే హీరోయిన్ కృతి సనన్.

కృతి కొంచెం టైట్ బట్టలు వేసుకోని డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ గా వెళ్ళింది‌. దానికి కారణం భైరవీ గోస్వామి అనే మరో హీరోయిన్ ఆ వీడియో మీద చాలా దారుణమైన కామెంట్స్ చేయడమే. ఆ వీడియోని షేర్ చేస్తూ “ఈమె ఓ పిచ్చిదానిలా ప్రవర్తిస్తోంది (డ్యాన్స్ గురించి). అసలు తను ఒక హీరోయిన్ ఎలా అయ్యింది ? హెడ్ లైట్ లేదు, బంపర్ లేదు. కాలేజీ అమ్మాయిలు కూడా తనకంటే బాగుంటారు” అంటూ కృతి ఫిగర్ మీద ఓ నీచమైన పోస్ట్ పెట్టింది.

మీకు తెలిసిందే, కృతి బక్కగా ఉంటుంది. ఆ బాడిసైజ్ మీద విమర్శ చేస్తూ, ఆమే ఛాతిభాగం, బ్యాక్ పై అలా కామెంట్ చేయడం నిజంగా బాధకరమే. ఇదే కామెంట్ ఎవరైనా మగవారు చేసుంటే చాలా పెద్ద గొడవయ్యేది‌. అలాగని కృతి కామ్ గా ఉండలేదు. నిన్న ఓ పెద్ద చురకే అంటించింది. భైరవీ కామెంట్స్ మీద స్పందిస్తూ “అసలు భైరవీ గోస్వామి అంటే ఎవరు ? తనకి కావాల్సింది పబ్లిసిటి‌. అది దొరికింది, సంతోషం. మీ అందరికి ఇప్పుడు తన పేరు కూడా తెలుసు” అంటూ భైరవీ రేంజ్ ఏంటో తన సమాధానంలో చెప్పింది కృతి‌.