ప్రభాస్‌పై పెదనాన్నకు పీకల్లోతు కోపం..!     2018-06-25   21:57:35  IST  Raghu V

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌పై పెదనాన్న రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు పీకల్లోతు కోపంతో ఉన్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రభాస్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నాడు అంటే ఖరాణం పెదనాన్న కృష్ణంరాజు అనే విషయం ప్రతి ఒక్కరికి తెల్సిందే. అయితే ప్రస్తుతం ఆ పెదనాన్న మాటనే కాదంటూ, తనకు తోచిన విధంగా ప్రభాస్‌ చేసుకుంటూ పోతున్నాడు అని, తన వారసుడిగా సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ ఇలా చేయడం కృష్ణం రాజుకు నచ్చడం లేదు అంటూ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకు ప్రభాస్‌ కాదంటున్న విషయం ఏంటో తెలుసా.. పెళ్లి.

గత కొంత కాలంగా ప్రభాస్‌ పెళ్లి కోసం ఫ్యాన్స్‌ మరియు ప్రేక్షకులు, సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాని ప్రభాస్‌ పెళ్లికి మాత్రం ఆసక్తిగా లేడు. ఈయన అనుష్కతో ప్రేమలో ఉన్నట్లుగా ఆ మద్య వార్తలు వచ్చాయి. అందుకే ఇద్దరు త్వరలోనే వివాహం చేసుకుంటారనే వార్తలు వచ్చాయి. సరే అలా అయినా బాగానే ఉంటుందని అంతా భావించారు. కాని తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ ఇద్దరు కూడా ప్రకటించారు. దాంతో ఇద్దరి ప్రేమ వ్యవహారంకు సంబంధించిన పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడ్డట్లయ్యింది. తాజాగా ప్రభాస్‌ కోసం కుటుంబ సభ్యులు గోదావరి జిల్లాకు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను అనుకున్నారు.