కృష్ణా జిల్లాకి “ఎన్నారై” ల భారీ సాయం     2018-04-17   05:46:26  IST  Bhanu C

జన్మ నిచ్చిన తల్లిపై ఎంత ప్రేమాభిమానాలు ఉంటాయో అలాగే పుట్టిన గడ్డపై కూడా అంతే ప్రేమ ఉంటుంది అయితే ఆ ప్రేమని చూపించడానికి సరైన సందర్భం రావాలి అంతే..అయితే ఆ సందర్భం రానే వచ్చింది నవ్యాంద్ర లో కీలక భాగం అయిన కృష్ణా జిల్లా కోసం తమ జిల్లా ఋణం తీర్చు కోవడం కోసం ప్రవాసులు నడుం బిగించారు..తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు అందుకు తగ్గట్టుగానే ఒక ప్రనాలికని సిద్దం చేసుకున్నారు..

తమ జిల్లాపై ఉన్న ప్రేమ అమెరికాలో సుమారు పదివేల మంది ప్రవాసాంధ్రులని కదిలించింది…తరగతి గదుల్లో సంపూర్ణ డిజిటల్‌ విద్యా బోధన, అసంపూర్ణ అంగన్‌వాడీ భవనాల అభివృద్ధికి, జిల్లాలోని వేలాది మంది గర్భిణులు, బాలింతలు, పిల్లలతో పాటు సాధారణ ప్రజల ఆరోగ్యం కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించటానికి సిద్దం అయ్యారు అమెరికాలో పది వేల మంది సభ్యులతో కూడిన కృష్ణా జిల్లాకు చెందిన అతి పెద్ద ప్రవాసాంధ్ర గ్రూపుతో ఆదివారం జిల్లా కలె క్టర్‌ లక్ష్మీకాంతం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రూపులోని 108 మంది ప్రతినిధులు 35 రాష్ర్టాల నుంచి పాల్గొన్నారు.