Koratala responds on Mahesh – Balakrishna film

మహేష్ బాబు – బాలకృష్ణ ఓకే సినిమాలో అనే రూమర్ ఇలా రాగానే తెగ సంబరపడిపోయారు నందుమూరి, ఘట్టమనేని అభిమానులు. అందులోనూ కొరటాల శివ డైరెక్టర్ అన్నారు. మహేష్ బాబు సూపర్ స్టార్ డమ్ కి బాలయ్య బాబు మాస్ ఫాలోయింగ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు మిగలవు అని తెగ ముచ్చటిపడిపోయారు. ఇంతలోనే అసలు విషయం బయటపడి, వారి ఆశలపై, అంచనాలపై నీళ్ళు చల్లింది.

మహేష్ బాబు – బాలకృష్ణ మల్టిస్టారర్ లో నటించట్లేదు. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల శివ ఖండిచారు. అసలు తన తదుపరి చిత్రం మల్టిస్టారర్ కాదని, ఎలాంటి క్రేజీ కాంబినేషన్స్ లేవని, వస్తున్న రూమర్లను పట్టించుకోవద్దని తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చారు కొరటాల. సో, మహేష్ – కొరటాల తప్ప, మరో పెద్ద పేరు ఉండదన్నమాట సినిమాలో.

ఇక డి.వి.వి. దానయ్య నిర్మించే ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తాడనే రూమర్ కూడా ఉంది. పాత్ర సంగతి పూర్తిగా తెలియదు కాని, ఈ సినిమా ఫిబ్రవరిలో మొదలవుతుంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే, వచ్చే దసరాకి బాక్సాఫీస్ బరిలో ఈ సినిమా ఉంటుంది.