తెరమీదకి కిలారు రాజేష్..ఎన్టీఆర్ కి లోకేష్ కి ఏంటి లింక్..?     2018-04-25   04:13:18  IST  Bhanu C

కిలారు రాజేష్ ఇప్పుడు ఈ పేరు రాజకీయ వర్గాల నుంచీ ఎంతో మంది నేతలకి పెద్ద ప్రశ్నలా మారింది..అసలు ఎవరు ఈ కిలారు రాజేష్..లోకేష్ కి ఎన్టీఆర్ కి సంభంధం ఏమిటి..? ఎవరికీ పరిచయం లేని ఈ కిలారి రాజేష్ పేరు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించారు..అసలు పవన కళ్యాణ్ కి ఈ కిలారి రాజేష్ ఎలా తెలిసు.? ఇప్పుడు ఇదే అందరికీ వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారిపోయింది..అసలు వివరాలలోకి వెళ్తే…

నన్ను కెలికేశారు ఇక నేను ఊరుకోను రెచ్చిపోతా అంటూ మీడియాని ఒక ఆట ఆడుకుంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీడియా అధినేతలపై అస్త్రాలని ఎక్కుపెట్టుకుని ఉంచుకున్నాడు..అందులో భాగంగా టీవీ9 శ్రీనిరాజుని బయటకి లాగి సంచలనం సృష్టించాడు…అయితే అదే సమయంలో పవన్ మరొక వ్యక్తీ పేరు కూడా తెరపైకి తీసుకువచ్చాడు అతడే కిలారు రాజేష్..ఇప్పుడు రాజేష్ ఎవరు అనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారిపోయిని..లోకేష్ అవినీతిపై మాట్లాడిన పవన్ లోకేష్ కిలారు రాజేష్ తో కలిసి నాపై ఎన్నో అసత్య ప్రచారాలు చేశారు అంటూ ఫైర్ అయారు.