కిడ్నీల్లో రాళ్ళకి కారణమయ్యే అలవాట్లు పొరపాట్లు ఇవి ... మానేయండి     2018-05-14   01:12:13  IST  Lakshmi P

కిడ్నీల్లో రాళ్ళు … పక్కింట్లో ఉండే ముసలాయన రాఘవరావుకే కాదు, ఎదురింట్లో ఉండే కుర్రాడు జగదీష్ కి కూడా వచ్చేసాయి. మరి అంతటి సాధరణ సమస్య అయిపోయింది ఇది. ఏ ఊరిలోని, ఏ కాలని చూసినా, పది పాతిక మంది ఈ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. కాదనలేని వాస్తవం ఇది. మరి ఎప్పుడైనా భయపడ్డారా? మీకు కూడా కిడ్నీల్లో వస్తే ఏంటి పరిస్థితి? అసలు ఇంతమంది ఎందుకు ఈ సమస్య బారిన పడుతున్నారు? దానర్థం మన రోజువారి అలవాట్లు కొన్ని ఆరోగ్యకరమైనవి కావా? కిడ్నిల్లో రాళ్ళు వస్తే ఏంటి ప్రమాదం? అసలు అవి ఎలా వస్తాయి? రాకుండా ఎలా అడ్డుకోవాలి? పూర్తిగా చదివి తెలుసుకోండి.

అసలు కిడ్నీల్లో రాళ్ళు అంటే ఏమిటి? వీటిలో రకాలు ఉన్నాయా?

కిడ్నిల్లో రాళ్ళు అంటే నిజంగానే రాళ్ళు రప్పలు చేరడం కాదు‌. మినరల్స్, ఉప్పు, వాటి మిశ్రమాలు గట్టిగా కిడ్నిల్లో పేరుకుపోవడం. ప్రధానంగా కిడ్నీ రాళ్ళు నాలుగు రకాలి‌. అవి Cystine Stones, Struvite Stones, Calcium Oxalate Stone మరియు Uric Acid Stone.

కాల్షియం స్టోన్స్ :

ఎక్కువగా కాల్షియం రాళ్ళే వస్తుంటాయి. విటిమిన్ డి మరీ ఎక్కువగా తీసుకోవడం, అసంపూర్ణమైన డైట్, Oxalate ని ప్రోత్సహించే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, మైగ్రేన్ సమస్య ఉండటం మరియు topiramate లాంటి మందులు వాడటం వలన ఇవి రావొచ్చు.

యూరిక్ ఆసిడ్ స్టోన్స్ :

నీళ్ళు తక్కువగా తాగే వారికి ఈరకం రాళ్ళు వస్తాయి. అలాగే కొందరికి ద్రవపదార్థాలు ఒంట్లో నిలవవు, అతి మూత్రం, రక్తం కోల్పోతుండటం (స్త్రీలు పీరియడ్స్ లో) వలన ఈ సమస్య రావొచ్చు.

సిస్టీన్ స్టోన్స్ :

ఈరకం రాళ్ళు ప్రధానంగా వంశపారంపర్యంగా వస్తాయి‌. వీరి జీన్స్ మూలాన, కిడ్నీలు ఎక్కువగా అమినో ఆసిడ్స్ విపరీతంగా విడుదల చేసి ఈ సమస్యకు కారణమవుతాయి.