మూత్రపిండాల(కిడ్నీ)లో రాళ్ళు ఏర్పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

మూత్రపిండాలు(కిడ్నీ)లో రాళ్ళూ ఉంటే విపరీతమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పిని తట్టుకోవటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మూత్రంలో కొన్ని రసాయనాలు అతిగా ఉన్నప్పుడు మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. సాదారణంగా ఈ రాళ్లు అనేవి కాల్షియం అక్సలేట్, ఫాస్పరస్ మరియు యూరిక్ ఆమ్లం వలన ఏర్పడతాయి.

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ మరియు డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ వారు చేసిన అధ్యయనంలో స్త్రీల కంటే పురుషులలో మూత్రపిండాల్లో రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని మరియు 20 నుంచి 40 సంవత్సరాల లపు వారిలో ఎక్కువగా ఈ సమస్య ఉంటుందని తెలిపింది.

సాధారణంగా చిన్న రాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. అయితే పెద్దగా ఉన్న రాళ్లు మాత్రం మూత్ర మార్గములో ఇరుక్కుపోయి మూత్ర ప్రవాహంను నిరోధించవచ్చు. అంతేకాక పెద్ద రాళ్ళ కారణంగా మూత్ర మార్గము కూడా దెబ్బతింటుంది.

1. తగినంత నీటిని త్రాగాలి తగినంత నీటిని త్రాగకపోతే మూత్రపిండాలకు నష్టం కలగటమే కాకుండా మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. తగినంత నీటిని తీసుకోవటం వలన మూత్రపిండాలు జీవక్రియ వ్యర్థాలను సమర్ధవంతంగా

బయటకు పంపుతాయి.