Khaidi No 150 is a big disaster on TV

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకి సంతోషపడాలో, బాధపడాలో అర్థం కావడం లేదు. పునరాగమనంలో ఖైదీ నం 150 బాహుబలి మినహాయిస్తే, తెలుగులో అతిపెద్ద హిట్ గా నిలిచింది. కాని ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవకుండా చేసారు టీవి ప్రేక్షకలు. మీలో ఎవరు కోటీశ్వరుడు ఎవరు ఊహించని దారుణమైన టీఆర్పీ రేటింగ్స్ తో “స్టార్ మా” యాజమాన్యానికి చుక్కులు చూపిస్తే, తాజాగా ఖైదీనం 150 మరో దెబ్బ తగిలించింది.

ఇటివలే టెలికాస్ట్ ఈ సినిమాకి చాలా అంటే చాలా తక్కువ టీఆర్పీ వచ్చింది. ప్రేక్షకుల ఆదరణ లేక, ఛానెల్ కి పెద్ద తలనొప్పి తెచ్చిపెట్టింది. BARC ఈరోజు విడుదల చేసిన ఫలితాల ప్రకారం ఖైదీనం కేవలం 6.93 రేటింగ్ రాబట్టగలిగింది. ఇది ఎంత దారుణమో ఒక్క ముక్కలో చెప్పాలంటే గత ఏడాది వచ్చిన బ్రహ్మోత్సవం ప్రీమియర్ టీఅర్పీ 7.52. ఇక మీరే అర్థం చేసుకోండి.

ఈ ఏడాది వచ్చిన చిత్రాల్లో ఇప్పటివరకు అయితే ఇది నాలుగొవ స్థానంలో ఉంది. 2017 లో వచ్చిన చిత్రాల టీఆర్పీ ర్యాకింగ్స్ ఇలా ఉన్నాయి :

1) శతమానంభవతి – 15.39
2) ఓం నమో వెంకటేశాయ – 9.81
3) నేను లోకల్ – 9.28
4) ఖైదీ నం 150 – 6.93
5) గౌతమీపుత్ర శాతకర్ణి – 5.52