Keshava Movie Review

టెక్నికల్ టీమ్ :

సినిమాటోగ్రాఫీ సూపర్. దివాకర్ మణి కొన్ని సీన్స్ లో వాడిన కలర్స్‌ మనం సాధారణంగా తెలుగు సినిమాల్లో చూసేవి కావు. బర్డ్ వ్యూ యాంగిల్స్ కొన్ని సీన్స్ కి చక్కగా కుదిరినా, అలాంటి షాట్స్ మరీ ఎక్కువ పెట్టేసారేంటో. ఓవరాల్ గా అయితే సినిమాటోగ్రాఫర్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. సన్ని అందించిన బాణిలు మెదడులో రిజిస్టరు అవకపోవచ్చు కాని, సినిమా మూడ్ కి మాత్రం సరిపోతాయి. క్లయిమాక్స్ ముందు వచ్చే శ్లోకం బిట్ సీన్ లో పెద్దగా విషయం లేకున్నా బాగా ఎలివేట్ చేస్తుంది. ఎడిటింగ్ డిపార్టుమెంటు బాగా కష్టపడ్డారు. సినిమా నిడివి అటుఇటుగా రెండే గంటలు. అయినా, ఇంకా కత్తిరించాల్సిన సన్నివేశాలు ఉంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

ఫాంటసీ సినిమాల్లో ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా ప్రేక్షకులు పట్టించికోరు. బాహుబలినే తీసుకోండి .. ఒక అమ్మాయిని ఊహించుకుంటూ ఆకాశాన్ని అంటే కొండను శివుడు ఎందుకు ఎక్కుతాడు అని మనం అడగగలమా? ఆ జానర్ కి అలాంటి సినిమాటిక్ లిబర్టీ ఉంటేనే కిక్కు. కాని థ్రిల్లర్స్ లో చిన్న పాయింట్ కూడా సినిమాటిక్ గా అనిపించకూడదు. అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. కేశవ విషయానికి వస్తే సినిమాటిక్ లిబర్టీ ఎక్కవయిపోయింది. ముఖ్యంగా సెకండాఫ్ .. నిఖిల్ తప్ప ఇంకో పాత్రలో బలం, బరువు ఉండదు. నిఖిల్ ఇష్టం వచ్చినప్పుడు మర్డర్ చేస్తాడు. పెద్ద సంఘర్షణ ఉండదు. అలాంటప్పుడు ఆసక్తి ఎలా పుడుతుంది? అదీకాక ఇరికించిన లాజిక్కులు, ట్విస్టులు. గజినీ, ఐ .. ఇప్పుడు కేశవ. ఇలాంటి రివేంజ్ డ్రామాలు మనకు కొత్త కాదు. అలాంటప్పుడు ఎంత పకడ్బందీగా కథనం రాసుకోవాలి .. కాని అది జరగలేదు. మధ్యమధ్యలో వచ్చే కామెడీ సీన్లు సరిగా ఉడకని కథనాన్ని ఇంకా దెబ్బతీస్తాయి.

అలాగని కేశవ బ్యాడ్ మూవీ కాదు, మన అంచనాలను అందుకోలేకపోయిన సినిమా. దీనికి ప్రధాన కారణం దర్శకుడు సుధీర్ వర్మ. నిఖిల్ మీద నమ్మకం ఉన్నవారు ఓసారి వెళ్ళి చూడచ్చు. బోర్ కొట్టదు .. అలాగే థ్రిల్ ని కూడా ఇవ్వదు.

ప్లస్ పాయింట్స్ :

* ఫస్టాఫ్

* సినిమాటోగ్రాఫీ

* నిఖిల్ పెర్ఫార్మెన్స్

* సంగీతం

మైనస్ పాయింట్స్ :

* బలహీనమైన ప్రతినాయకులు

* ఇరికించిన కామెడీ సీన్లు

* ఒక ట్రాక్ మీద నిటారుగా వెళ్ళని స్క్రీన్ ప్లే

* సినిమాటిక్ లిబర్టీ

* మొత్తం మీద సెకండాఫ్

చివరగా :

ఉడికిఉడకని కేశవ

తెలుగుస్టాప్ రేటింగ్ : 2.75/5