మరోసారి వార్తల్లోకి చేపలమ్ముకునే అమ్మాయి....పదిహేను లక్షల సాయం..     2018-08-19   12:30:46  IST  Rajakumari K

హసన్ అమీద్ గుర్తుందా..చేపలు అమ్ముకుని వచ్చిన డబ్బుతో చదువుకుంటున్న అమ్మాయి ..గత నెల సోషల్ మీడియా లో వైరలైన అమ్మాయి..గుర్తింపుకోసమే ఇదంతా చేస్తుందంటూ కొందరు ఆకతాయిలు అమ్మాయిని సోషల్ మీడియాలో అల్లరిపాలు చేసారు.ఆ అమ్మాయి నిజంగానే చేపలు అమ్ముతుందా అంటూ కొందరు తనుంటున్న ప్లేస్ కి వెళ్లి వాకబు చేశారు…దాంతో ఆ అమ్మాయి చేతులెత్తి మరీ వేడుకుంది నన్నొదిలేయండంటూ..అదంతా ఒకవైపు…ఇప్పుడు అదే అమ్మాయి మరోసారి సోషల్ మీడియా స్టార్ అయింది..ఈ సారి తన ఔదార్యాన్ని చాటుకుని పాజిటివ్ పబ్లిసిటి సొంతం చేసుకుంది..ఇంతకీ హసన్ ఏం చేసిందంటే…

Kerala Flooding,Kerala Teen Trolled

వరద కష్టాలు ఆ అమ్మాయిని కదిలించాయి. పేదరికం వెంటాడుతున్నా.. వరద బాధితుల సాయం కోసం ముందుకొచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 1.5 లక్షల సాయం చేసి మనసును చాటుకుంది. అ అమ్మాయి సాయం వెనుక గొప్ప త్యాగం ఉంది.హనన్ ఫొటోలు వైరల్ కావడంతో చాలామంది సాయం చేయడానికి ముందుకొచ్చారు. మాలీవుడ్ నటులు కూడా స్పందించి సినిమా అవకాశాలను ఇవ్వడానికి ముందుకొచ్చారు. హనన్ విద్యభ్యాసానికి ఆర్థికసాయం చేశారు.అప్పట్లో కేరళ సిఎం పినరయ్ విజయన్ కూడా ఆమెకు సాయం చేస్తామని మాట ఇచ్చారు.. అయితే ప్రస్తుత వరదలు హనన్ ను కదిలించడంతో తనకి వచ్చిన ఆర్థిక సాయం మొత్తాన్ని కేరళ బాధితుల నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించి తన ఔదార్యాన్ని చాటుకుంది..