కేరళ వరదలు: వృద్ధురాలికి సహాయం చేయడానికి వీపునే మెట్టుగా మార్చిన మత్స్యకారుడు.! వీడియో!!!     2018-08-20   10:16:23  IST  Sainath G

కేరళను వర్షం కుదిపేసింది. గత వారం రోజులుగా వరద ముంచెత్తుతోంది. అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఇప్పటివరకు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు విరాళాలు అందించాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పిలుపునిచ్చారు.

ఉభయ తెలుగు రాష్ట్రాలు విరాళాలు అందించి తమ మానవత్వాన్ని చాటుకున్నాయి. అంతేకాదు మన హీరోలు కూడా తమవంతు సాయం చేసారు. కేరళ వరద బాధితులను ఆర్మీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్‌లతో పాటు మత్స్యకారులు, ఆరెస్సెస్ కూడా సహాయం అందిస్తోంది. వరద బాధితులను ఆదుకునేందుకు టోపీ లేని మత్స్యకారులు రంగంలోకి దిగారు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యంతో పాటు స్థానిక మత్స్యకారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Kerala Fishermans,Social Media

తనూర్‌కు చెందిన జైసల్‌ కేపీ మత్స్యకారుడు. చిన్నపిల్లతో పాటు వరదల్లో చిక్కుకున్న ఓ తల్లి, వృద్ధురాలి ఆచూకీలను కనిపెట్టడంలో ఈయన ఎన్డీఆర్ఎఫ్ బలగాలకు తోడ్పడ్డారు. అనంతరం వృద్ధురాలిని పడవలోకి ఎక్కించేందుకు ఆ మత్స్యకారురుడు తన వీపును మెట్టుగా మార్చాడు. వరద నీళ్లలో మోకాళ్లపై ఆయన ముందుకు వంగాడు. ఆయనపైకి ఎక్కి ఆమె పడవలోకి చేరుకారున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సదరు మత్స్యకారుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.facebook.com/labeedpage/videos/212586456277416/