బాబు అంటించి వదిలేస్తే..క్రేజీవాల్ తగలేట్టేస్తున్నాడు  

ఇప్పుడు ఒక్కొక్కరుగా ఒక్కో రాష్ట్రం మోడీ పై పగ తీర్చుకున్తున్నాయి ..అందులోనూ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం కూడా కావడంతో అందరూ ఒక్క తాటిపై ఉన్నారు ఎలా అయినా సరే మోడీ ని గద్దె దించాలి అనే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు అయితే చంద్రబాబు తరువాత మళ్ళీ క్రేజీవాల్ మోడీ పై మరో సారి స్వరం పెంచారు..తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్రేజీ వాల్ మోడీ ని ఒక ఆట ఆడుకున్నాడు..

మోడీ ప్రభుత్వం తమ మంత్రులపై 14 అవినీతి కేసులు బనాయించిందని,ఒక్కరిని కూడా దోషిగా తేల్చడం కానీ, అరెస్టు కానీ చేయలేదని అన్నారు. కేజ్రీవాల్ ఏడాదిగా మౌనంగా ఉన్నారని ప్రజలు అనుకుంటున్నారు. అయితే నా మౌనాన్ని కేంద్రం అడ్వాంటేజ్‌గా తీసుకుంటోంది అని కేజ్రీవాల్ మండిపడ్డారు…తమ బంధువులకు అడ్వర్‌టైజ్‌మెంట్ కాంట్రాక్టులిచ్చారనే ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాపై ఓ కేసు పెట్టారు…మరి అదే అనుమతులు మనీష్ సిసోడియా ఇచ్చి ఉన్నారు అతడిని ఎందుకు లోపల వేయలేదు అని ప్రశ్నించారు క్రేజీవాల్…అయితే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఒకరి తరువాత మరొక రాష్ట్ర సీఎం లు ఇలా మోడీ ని క్రేజీగా ఎండగట్టడం వెనుక పక్కా వ్యూహం ఉందని అంటున్నారు విశ్లేషకులు .