బాబు అంటించి వదిలేస్తే..క్రేజీవాల్ తగలేట్టేస్తున్నాడు     2018-06-12   04:40:12  IST  Bhanu C

భారత ప్రధాని మోడీ నియంతృత్వ పోకడలకి..మోడీ అణిచివేత ధోరణికి దేశంలో ఎన్నో రాష్ట్రాల నేతలు అనేక సందర్భాలలో మోడీ పై తమ గళాన్ని వినిపించారు..మోడీ ఒక గొప్ప ప్రధాని అనే ముసుగు లోపల ఉండే మరో మోడీ ఎవరికీ కనపడడు..మోడీ కి వ్యతిరేకంగా గళం విప్పే వారికి మాత్రమే అసలు మోడీ కనిపిస్తాడు..ఈ వ్యాఖ్యలు భాదిత నేతలు ఎన్నో సందర్భాలలో చేశారు కూడా అయితే జాతీయ మీడియాని మేనేజ్ చేసుకోగల మోడీ దేశ ప్రజలకి ఎంతో సౌమ్యుడిగానే కనిపిస్తాడు..అయితే 2014 ఎన్నికలు జరిగిన తరువాత మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఢిల్లీ లో తరువాత ఏడాది ఎన్నికలు జరిగాయి..ఈ ఎన్నికల్లో

క్రేజీవాల్ భారీ మెజారిటీతో ఒక్కసారిగా ఢిల్లీ ఫీటాని తన హస్తగతం చేసుకున్నాడు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన క్రేజీవాల్..తరువాత తన ఆమాద్మీ పార్టీని విస్తరించాలని అనుకున్న సమయంలో మోడీ కి వెన్నులో వణుకు మొదలయ్యింది దాంతో మోడీ పై ఉక్కుపాదం మోపేసాడు..క్రేజీవాల్ శక్తీ మోడీ ని ఎదుర్కోవడానికి సరిపోలేదు.. అంతేకాదు ఎన్ని అక్రమ కేసులు బనాయించారు..అయితే కొంతకాలం క్రేజీ సైలెంట్ అయిపోయారు..మోడీ నియంత పాలనకి మొదటి నిదర్శనం క్రేజీ వాల్ అని చేపచ్చు అయితే ఎప్పుడైతే చంద్రబాబు మోడీ పై తిరుగు బావుటా ఎగరేశాడో అప్పుడు అన్ని రాష్ట్రాల సీఎం లకి కొండంత బలం వచ్చినట్టు అయ్యింది..